https://oktelugu.com/

Bigg Boss Telugu 8: K బ్యాచ్ గ్రూప్ ని టాప్ 5 లో పెట్టిన పృథ్వీ తమ్ముడు..నాగార్జున రియాక్షన్ అదుర్స్!

నిన్న కంటెస్టెంట్స్ కి మరికొంత బూస్ట్ ని ఇస్తూ వాళ్లకు సంబంధించిన స్నేహితులను, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చారు. పృథ్వీ కి సంబంధించి అతని తమ్ముడితో పాటు, ప్రియురాలు దర్శిని కూడా వచ్చింది. అయితే పృథ్వీ తమ్ముడుని నీ దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో పెట్టమని అడగగా, ఆ అబ్బాయి వరుసగా K బ్యాచ్ మొత్తాన్ని టాప్ 5 లో నిలబెడుతాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 17, 2024 / 08:39 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పదం ‘K బ్యాచ్’. నిఖిల్ , యష్మీ, ప్రేరణ, పృథ్వీ లను K బ్యాచ్ అని పిలుస్తుంటారు, వీళ్లకు అదనంగా విష్ణు ప్రియ, నబీల్ కూడా ఈ బ్యాచ్ లో భాగమే. వీళ్లంతా నామినేషన్స్ దగ్గర నుండి, హౌస్ మేట్స్ తో గేమ్ ఆడే విషయం వరకు ప్రతీ ఒక్కటి గ్రూప్ గేమ్స్ ఆడడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి అయితే ఈ గ్రూప్ గేమ్స్ ఎక్కువ అయిపోయాయి. యష్మీ, నబీల్ గ్రాఫ్స్ ఈ గ్రూప్ గేమ్స్ వల్ల బాగా డౌన్ అవ్వగా, వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన గౌతమ్ ఇప్పుడు ఏకంగా టైటిల్ రేస్ లోకి వచ్చాడు. ఈ వారం వీళ్ళ కుటుంబాలు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలకు వచ్చి వీళ్లకు ఇచ్చిన సలహాలు ఇవే, గ్రూప్ గేమ్స్ ఆడకండి అని. వాళ్ళ సలహాలను ఎంత వరకు తీసుకుంటారో చూడాలి.

    అయితే నిన్న కంటెస్టెంట్స్ కి మరికొంత బూస్ట్ ని ఇస్తూ వాళ్లకు సంబంధించిన స్నేహితులను, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చారు. పృథ్వీ కి సంబంధించి అతని తమ్ముడితో పాటు, ప్రియురాలు దర్శిని కూడా వచ్చింది. అయితే పృథ్వీ తమ్ముడుని నీ దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో పెట్టమని అడగగా, ఆ అబ్బాయి వరుసగా K బ్యాచ్ మొత్తాన్ని టాప్ 5 లో నిలబెడుతాడు. దీనిని చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే, అంత ఫన్నీ గా అనిపించింది. పృథ్వీ వాళ్ళ తమ్ముడి దృష్టిలో తన అన్నయ్య కాకుండా టాప్ 5 ఎవరు అని అడిగితే నిఖిల్, నబీల్, యష్మీ,ప్రేరణ, విష్ణు ప్రియ పేర్లు పెడుతాడు. నబీల్ పేరుని పెడుతున్న సమయంలో నాగార్జున ‘నబీల్ ఎందుకు’ అని అడగగా, మా అన్నయ్య కి స్నేహంగా ఉండేవాళ్లు పేర్లు పెడుతున్నాను సార్ అని నవ్వుతూ చెప్తాడు పృథ్వీ తమ్ముడు.

    ఆ తర్వాత ఈ 5 మంది టాప్ 5 ర్యాంకింగ్ తో నిల్చోబెట్టగా, నాగార్జున వాళ్ళ వైపు సెటైరికల్ చూసి, ‘సరే ఇక వెళ్ళండి’ అని అంటాడు. ఈ ఘటన మొత్తం చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపిస్తాది. ఇది కాసేపు పక్కన పెడితే పృథ్వీ ప్రేయసి దర్శిని కి విష్ణు ప్రియ అసలు నచ్చలేదని అర్థం అవుతుంది. విష్ణు ప్రియ గురించి ఏదైనా చెప్పమని నాగార్జున అడగగా, మా పృథ్వీ ని లోపల చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు అని అంటుంది. అంతేనా, నా గురించి ఏమి చెప్పవా అని విష్ణు అడగగా, దానికి దర్శిని సమాధానం చెప్తూ, గేమ్ సరిగా ఆడడం లేదు, ఇంకా బాగా ఆడాలి నువ్వు, నీ గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి అని సీరియస్ ముఖంతో చెప్తుంది దర్శిని. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.