సినిమా ఇండస్ట్రీలోని మూస ధోరణికి స్వస్తి చెప్పిన నటుడు చిరంజీవి…బ్రేక్ డాన్స్ చేసి, డూప్ లేకుండా ఫైటింగ్స్ చేసి ప్రేక్షకుడిని మెప్పించాడు. ప్రేక్షకుడికి ఏ విషయాలు నచ్చుతాయి తన నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది చిరంజీవికి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు. అందుకే తనను తాను ప్రేక్షకుడికి తగ్గట్టుగా మార్చుకొని సినిమాలను చేస్తూ వచ్చాడు. చిరంజీవి సినిమాలను చూసే ప్రతి ప్రేక్షకుడు చిరంజీవిలో తనను తాను ఊహించుకుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే చిరంజీవిని వాళ్ళు పూర్తిగా ఓన్ చేసుకున్నారు. అందుకే స్క్రీన్ మీద చిరంజీవి ఏం చేసినా కూడా వాళ్లకు విపరీతంగా నచ్చుతుంది. తను మెగాస్టార్ గా మారడానికి అవన్నీ చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ఇక వరుసగా 6 సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లను సాధించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. అలాంటి చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి సపోర్టుగా నిలిచాడు. అయినప్పటికి వాళ్ళు సూపర్ సక్సెస్ లను సాధించిన తర్వాత చిరంజీవిని పట్టించుకోని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి.
కెరియర్ స్టార్టింగ్ లో రాజశేఖర్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు చిరంజీవి అతనికి సపోర్టుగా నిలబడి కొంతమంది దర్శకులను సైతం రాజశేఖర్ తో సినిమాలు చేయండి అని రిఫర్ చేశారట. కానీ ఫైనల్ గా రాజశేఖర్ మాత్రం స్టార్ హీరోగా మారిన తర్వాత చిరంజీవిని దూషిస్తూ కొన్ని మాటలు మాట్లాడిన సందర్భాలు మనం చాలానే చూశాం.
చిరంజీవి సినిమాలకు పోటీగా తన సినిమాలను రిలీజ్ చేసి డిజాస్టార్లను కూడా మూట గట్టుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి కంటే తనే గొప్పవాడిని అని ప్రూవ్ చేసుకోవాలి అని చాలా సందర్భాల్లో అనుకున్నాడు కానీ అది వర్కౌట్ కాలేదు… మోహన్ బాబు లాంటి నటుడుకి సైతం చిరంజీవి చాలా సందర్భాల్లో కొన్ని సినిమాలను రిఫర్ చేశారట.
కొంతమంది దర్శకులు మోహన్ బాబుతో సినిమాలను చేసి హీరోగా మోహన్ బాబు నిలబడడానికి చాలావరకు కృషి చేశారు. అయినప్పటికి మోహన్ బాబు సైతం పలు సందర్భాల్లో చిరంజీవిని ఉద్దేశిస్తూ కొన్ని నెగెటివ్ కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి… ఇక ప్రస్తుతం ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ చాలా వరకు ఆయా హీరోల మీద ఫైర్ అవుతున్నారు…