Ram Charan – Sukumar Movie Updates: ఇండస్ట్రీలో డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు వస్తుంటాయి. ఒక సినిమాతో సక్సెస్ ని సాధించిన వాళ్లు మరొక సినిమాతో డిఫరెంట్ ప్రయత్నం చేయాలని చూస్తుంటారు. ముఖ్యంగా దర్శకులు మాత్రం రెగ్యూలర్ ఫార్మాట్లో సినిమాలను చేయకుండా డిఫరెంట్ గా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. ముఖ్యంగా సుకుమార్ లాంటి దర్శకుడు అదే రీతిలో ముందుకు సాగుతూ ఉంటాడు. ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఆయన ప్రేక్షకుల యొక్క ఐక్యను టెస్ట్ చేయడానికి కొన్ని పజిల్స్ లను సైతం ప్రేక్షకుల మీదకి వదులుతుంటాడు. వాటిని సాల్వ్ చేయాలి అంటే చాలా ఇబ్బంది… మొత్తానికైతే సినిమా ద్వారా అతను ఒక కంక్లూజన్ కైతే తీసుకొస్తాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ‘పుష్ప 2’ సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడు. 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఆ సినిమాతో ఇండియాలోనే ఆల్మోస్ట్ టాప్ 3 డైరెక్టర్లలో ఒకడిగా ఆయన గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… గతంలో వీళ్ళ కాంబినేషన్లో ‘రంగస్థలం’ అనే సినిమా వచ్చింది ఆ సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.
ముఖ్యంగా రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర ఇప్పటికి ప్రతి ఒక్కరు మైండ్లో మెదులుతుంది అంటే ఆ పాత్ర మీద సుకుమార్ రాసుకున్న రైటింగ్ గాని రామ్ చరణ్ నటించిన విధానం కానీ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయనే చెప్పాలి. ప్రస్తుతం సుకుమార్ లాంటి దర్శకుడు డిఫరెంట్ అటెంప్ట్ లు చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండడం విశేషం…
ఇక మరోసారి రామ్ చరణ్ తో ఆయన జత కడుతుండటం విశేషం… ఈ సినిమాలో రామ్ చరణ్ కి అన్న ఉన్నాడట. ఆ పాత్ర కోసం ఆయన ఇతర భాషల హీరోలను సంప్రదించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే తమిళ్ స్టార్ హీరో అయిన విక్రమ్ ను ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నగా నటింపజేస్తున్నట్టుగా తెలుస్తుంది.
‘రంగస్థలం’ సినిమాలో కూడా రామ్ చరణ్ అన్నగా నటించిన ఆది పినిశెట్టి క్యారెక్టర్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక దానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ అన్న పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఇక ఇప్పటికే సుకుమార్ చియాన్ విక్రమ్ తో మంతనాలు జరుపుతున్నాడట. మొత్తానికైతే విక్రమ్ ఒప్పుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…