EU shocks Trump: గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడి వైఖరితో యురోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఏడాదిగా ట్రంప్ టారిఫ్‌లు, అవమానాలు భరిస్తూ వచ్చిన యురోపియన్ యూనియన్ దేశాధినేతలు.. ఇక సహించేది లేదని షాక్ ఇచ్చారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో భారత్‌తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు, కానీ గణతంత్ర దినోత్సవం రోజు సంతకం జరిగే అవకాశం ఉంది. ప్రపంచం ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తోంది.
ట్రంప్ ఆగ్రహం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయూపై కఠినంగా ఉన్నారు. తమతో ఒప్పందాలు చేసుకునేవారు అమెరికా నియమాలకు లొంగాలని, లేకపోతే భారీ సుంకాలు భరించాలని హెచ్చరిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో వెనెజువెలా, కెనడా, గ్రీన్‌లాండ్‌ను అమెరికా భూభాగంగా చూపించడం వివాదాస్పదం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రోన్ గ్రీన్‌లాండ్‌పై సూచనలు చేస్తే, ట్రంప్ ఫ్రెంచ్ వైన్, షాంపెయిన్‌పై 200% టారిఫ్‌లు విధించాడు. మాక్రోన్ ప్రతీకారంగా ట్రంప్ సందేశాలు లీక్ చేశాడు. ప్రపంచ శాంతి ఫోరమ్‌లో ఫ్రాన్స్ చేరకపోవడంపై ట్రంప్ ’ఎంతకైనా చేరకపోతే ఎంత’ అని ఎద్దలించాడు.
ఈయూ ప్రతిఘటన..
ఈయూ అమెరికాతో ఉన్న వాణిజ్య చర్చలను ఆపేసింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ భారత్‌ను వేగవంతమైన ఆర్థిక శక్తిగా ప్రశంసించి, తక్షణం వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని ప్రకటించింది. ట్రంప్ మొదటి పాలనలో భారత్‌తో సఖ్యతగా ఉన్నాడు. ఇప్పుడు ’రష్యాతో మిత్రత్వం’పై కోపంగా ఉన్నాడు. భారత్‌పై రివేంజ్ తీర్చుకోవాలని ఇంటీవల చెప్పాడు. భారత్ ఈయూ డీల్‌ను స్వీకరిస్తే అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉంది. భారత్ అమెరికా ఒప్పందాలను పక్కనపెట్టి స్వప్రయోజనాలు కాపాడుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డెగో గార్సియా వివాదం..
మరోవైపు గ్రీన్‌లాండ్ తర్వాత ట్రంప్ కన్ను పడినది హిందూమహా సముద్రంలోని చిన్న ద్వీపం డెగో గార్సియాపై పడింది. బ్రిటన్ ఆధీనంలో ఉండే ఈ ఐలాండ్‌పై అమెరికా ఆక్రమణ ప్రణాళికలు రహస్యంగా జరుగుతున్నాయని సమాచారం. భారత్ మారిషస్‌కు దీన్ని బదిలీ చేయాలని ప్రయత్నిస్తోంది, అభివృద్ధికి సహకరిస్తోంది. ట్రంప్ దీన్ని అడ్డుకోవాలనుకుంటున్నాడు, బ్రిటన్ ‘తలతిక్క నిర్ణయం’ తీసుకుందని ఆరోపిస్తున్నాడు. ఇది భారత్–మారిషస్ సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం.
ఈయూ ఆత్మగౌరవాన్ని ప్రయోరిటీ చేసి భారత్‌తో ముందుకు సాగుతోంది. అమెరికా ఒత్తిళ్లను తిరస్కరిస్తూ. భారత్ వివాదాలకు దూరంగా ఉంటూ ఈయూ వంటి పెద్ద మార్కెట్‌తో బలోపేతం కావాలనుకుంటోంది. ట్రంప్ విధానాలు ప్రపంచ వాణిజ్యాన్ని మార్పు చేయవచ్చు, కానీ ఈయూ–భారత్ డీల్ విజయవంతమైతే అమెరికా ఒక్కటే కాకుండా ఇతర దేశాలకు మార్గదర్శకం అవుతుంది. భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలు భారత్ విదేశాంగ వ్యూహాన్ని రూపొందిస్తాయి.