India Trump tariffs: అమెరికా అధ్యక్షుడిగా రెండేసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. తన మొదటి ఏడాది పాలన మొత్తం టారిఫ్‌లతోనే సాగింది. మిత్రుడు, శత్రువు అని లేకుండా అన్ని దేశాల దిగుమతులపై టారిఫ్‌లు పెంచేశారు. 5 శాతం నుంచి 200 శాతం వరకు టారిఫ్‌లు విధించారు. భారత్‌పై మొదట 25 శాతం టారిఫ్ వేసిన ట్రంప్.. తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును సాకుగా చూపి మరో 25 శాతం టారిఫ్ విధించారు. అయితే తాజాగా భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి తగ్గిస్తున్న నేపథ్యంలో 25 శాతం టారిఫ్ కూడా ఎత్తివేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, ‘భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించడం స్వాగతిస్తున్నామన్నరు. ప్రస్తుత సుంకాలను తొలగించే మార్గాలు ఆలోచిస్తున్నాం‘ అని పేర్కొన్నాడు.
రష్యా చమురు వివాదం..
అమెరికా భారత్‌పై సుంకాలు విధించడానికి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను కారణంగా చెప్పింది. ఇది భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు 50% వరకు పెరగడానికి కారణమైంది. భారత్ ఈ ఆరోపణలను తగ్గించడంతో అమెరికా సానుకూలంగా స్పందించింది. ఈ మార్పు భారత్ ఆర్థిక వ్యూహాల స్పష్టతకు ఫలితం. ఇది రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది.
భారత్‌కు ఆర్థికంగా ప్రయోజనం..
సుంకాలు తగ్గితే భారత ఉత్పత్తులు (టెక్స్‌టైల్స్, ఫార్మా, ఐఖీ సేవలు) అమెరికా మార్కెట్‌లో పోటీ పడతాయి. ఇది ఎగుమతి ఆదాయాన్ని పెంచి, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అమెరికా–భారత వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇది బలపడే అడుగు. భారత్ ఇతర ఈయూ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ మార్పు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది.
తాజా పరిణామాలు ట్రంప్‌లో భయాన్ని సూచిస్తున్నాయి. భారత్ ఈయూ వాణిజ్య ఒప్పందం జరగకుండా ఉండేందుకే ట్రంప్ టారిఫ్‌ల ఎత్తివేత డ్రామా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యాను సాకుగా చూపి సుంకాలు విధించారు. ఇప్పుడు ఈయూ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో టారిఫ్‌లు ఎత్తివేయాలని భావిస్తున్నారు. అయితే ఏది ఏమైనా ట్రంప్‌ను నమ్మడానికి లేదు. ఈ నేపథ్యంలో ఈయుతో జరిగే అతిపెద్ద అగ్రిమెంట్‌ను కొనసాగించాల్సిన అవసరం భారత్‌పై ఉంది.