‘నారప్ప’లో హీరో వెంకటేశ్ ప్రేయసి ఎవరో తెలుసా?

అగ్రహీరో వెంకటేశ్ కు ఆల్ రెడి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. ఆయన పెద్ద కూతురు వయసు 30 ఏళ్లు. ఆమెకు పెళ్లి అయ్యి భర్తతో కలిసి యూరప్ దేశాల్లో నివసిస్తోంది. ఇటీవల ఇంటర్వ్యూల్లో మెరిసింది. తాజాగా నారప్ప సినిమాతో విక్టరీ వెంకటేశ్ మనముందుకొచ్చాడు. ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వెంకటేశ్ ప్రేయసిగా నటించిన క్యూట్ అమ్మాయి ఎవరబ్బా అని అందరూ ఆసక్తిగా ఆరాతీస్తున్నారట.. గూగుల్ లోనూ తెగ వెతుకుతున్నారట.. ఇంతకీ ఏవరీమె అంటూ వెతక్కగా […]

Written By: NARESH, Updated On : July 21, 2021 4:13 pm
Follow us on

అగ్రహీరో వెంకటేశ్ కు ఆల్ రెడి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. ఆయన పెద్ద కూతురు వయసు 30 ఏళ్లు. ఆమెకు పెళ్లి అయ్యి భర్తతో కలిసి యూరప్ దేశాల్లో నివసిస్తోంది. ఇటీవల ఇంటర్వ్యూల్లో మెరిసింది.

తాజాగా నారప్ప సినిమాతో విక్టరీ వెంకటేశ్ మనముందుకొచ్చాడు. ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వెంకటేశ్ ప్రేయసిగా నటించిన క్యూట్ అమ్మాయి ఎవరబ్బా అని అందరూ ఆసక్తిగా ఆరాతీస్తున్నారట.. గూగుల్ లోనూ తెగ వెతుకుతున్నారట.. ఇంతకీ ఏవరీమె అంటూ వెతక్కగా ఆఖరుకు సమాధానం దొరికింది.

వెంకటేశ్ ప్రేయసిగా ‘నారప్ప’ సినిమా ఫ్లాష్ లో చేసిన ‘కన్నమ్మ’ అనే పాత్రధారి ‘అమ్ము అభిరామి’. ఈ అమ్ముడు ఇదివరకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ మూవీలో చిన్న పిల్లగా.. హీరో మేనకోడలుగా నటించింది. అంత చిన్నగా ఉన్న ఈమె ఏకంగా నారప్పలో 50+ వెంకటేశ్ పక్కన హీరోయిన్ గా నటించింది. దాదాపు వీరిమధ్య గ్యాప్ 30 ఏళ్లు. అయినా పల్లెటూరి పిల్లగా అమాయకపు చూపులతో ఆకర్షించింది.

అమ్ము అభిరామిది చెన్నై. తమిళనాడులోనే పుట్టిన ఈమె చెన్నైలో చదువుకొని సినిమాల్లో నటిస్తోంది. 2017లో విజయ్ హీరోగా వచ్చిన ‘భైరవ’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో ‘రాక్షసుడు’ సినిమాలో స్కూలు విద్యార్థినిగా నటించింది. వెంకీ, అభిరామి మధ్య 30ఏళ్ల ఏజ్ గ్యాప్ అని.. అయినా వీరిద్దరూ తెరపై ఆకర్షనీయంగా కనిపించారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.