
2032 లో నిర్వహించబోయే ఒలింపిక్స్ కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వేదికను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో 35వ ప్రపంచ క్రీడా సంబరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. దీంతో 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఒలింపిక్స్ కు అతిథ్యమిస్తున్నా దేశంగా నిలుస్తుంది. సిడ్నీలో 200లో ఒలింపిక్స్ జరగ్గా అంతకముందు 1956లో మెల్ బోర్న్ వేదికగానూ ఈ అంతర్జాతీయ క్రీడలు జరిగాయి. 2032 ఒలింపిక్స్ అనంతరం పారాఒలింపిక్స్ కూడా అక్కడే జరగనున్నాయి.