Tammareddy:ఏపీలో కమ్మ వాళ్లు నచ్చకుంటే చంపేయండి? ‘తమ్మారెడ్డి’ నిప్పులు

Tammareddy: ఏపీలో సినిమా టికెట్ల ఇష్యూ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సస్పెన్స్ థిల్లర్ ను మూవీని తలపిస్తున్న ఈ వివాదంలోకి రోజుకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుండటంతో అందరి దృష్టి కామన్ గానే ఇటువైపు పడుతోంది. ఏపీలో సమస్యలేవీ లేవన్నట్లుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తరుచూ సినిమా వాళ్లను కించపర్చేలా కామెంట్స్ చేస్తుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. దీంతో సినిమా వాళ్లు సైతం ఎదురుదాడికి దిగుతున్నారు. ఏపీ సర్కారు టికెట్ల రేట్లను తగ్గించడంతో పలువురు సినీపెద్దలు […]

Written By: Raghava Rao Gara, Updated On : January 11, 2022 8:51 pm
Follow us on

Tammareddy: ఏపీలో సినిమా టికెట్ల ఇష్యూ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సస్పెన్స్ థిల్లర్ ను మూవీని తలపిస్తున్న ఈ వివాదంలోకి రోజుకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుండటంతో అందరి దృష్టి కామన్ గానే ఇటువైపు పడుతోంది. ఏపీలో సమస్యలేవీ లేవన్నట్లుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తరుచూ సినిమా వాళ్లను కించపర్చేలా కామెంట్స్ చేస్తుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. దీంతో సినిమా వాళ్లు సైతం ఎదురుదాడికి దిగుతున్నారు.

ఏపీ సర్కారు టికెట్ల రేట్లను తగ్గించడంతో పలువురు సినీపెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను గతంలో విన్నవించారు. అయితే ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఈక్రమంలోనే గతంలో పవన్ కల్యాణ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని, సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.

ఏ ఒక్కరి కోసమే ఇండస్ట్రీని టార్గెట్ చేయద్దని.. అవసరమైతే తన సినిమాలను ఆపుకోండి అంటూ  మాట్లాడటం అప్పట్లో సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న వైసీపీ మంత్రులు కౌంటర్ అటాక్ కు దిగారు. అయితే ఈ వివాదం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్న ప్రతీసారి ఎవరో ఒకరు సంచలన కామెంట్స్ చేస్తుండటంతో కథ మళ్లీ మొదటికే వస్తోంది.

ఇటీవలే పేర్ని నాని, డైరెక్టర్ ఆర్జీవీ సైతం ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్జీవీ తన వాదనను ప్రభుత్వం వద్ద విన్పించారు. అదేరోజు వైసీపీ ఎమ్మెల్యే నన్నపురెడ్డి ప్రసన్న కుమార్ సినిమా వాళ్లు బలిసి కొట్టుకున్నారనేలా మాట్లాడారు. సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్టు ఉందని ఆయన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దీనిపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడారు.

సినిమా హీరోలు కష్టపడి పని చేస్తేనే నిర్మాతలు రెమ్యూనరేషన్ ఇస్తారని తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. కానీ రాజకీయాల్లోకి సేవ చేస్తున్నామని చెప్పుకునే నాయకులకు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ నాయకులే కాకుండా దేశంలోని రాజకీయ నాయకులంతా ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

ప్రసన్న కుమార్ రెడ్డి కమ్మ కులాన్ని టార్గెట్ చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. కొద్దికాలం క్రితం వరకు ప్రసన్న కుమార్ రెడ్డి కమ్మ పార్టీలో లేరా? అంటూ ప్రశ్నించారు. ఏపీలో కమ్మ వాళ్లు నచ్చకుంటే వాళ్లను చంపేయండి? అప్పుడు మీకు ఏ గోల ఉండదని ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం సినిమా ధరలు తగ్గించినట్లుగానే నిత్యావసర ధరలను ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు. మరీ దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!