https://oktelugu.com/

Acharya: నైజాం ఫస్ట్ డే కలెక్షన్లలో ‘ఆచార్య’ ప్లేస్ ఎక్కడ ఉందంటే?

Acharya First Day Collections: టాలీవుడ్లో టాప్ హీరోల సినిమా విడుదలకు సిద్ధమైందంటే చాలు రికార్డులపైనే అందరి దృష్టి ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్లోని రిలీజైన బడా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లవర్షం కురిపిస్తున్నాయి. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు తొలిరోజే నుంచి రికార్డుల వేట మొదలు పెట్టి టాలీవుడ్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలుగా నిలిచాయి.   ఇలాంటి సమయంలోనే ‘ఆచార్య’ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రెండు వేలకు థియేటర్లలో సినిమాను విడుదల […]

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2022 / 12:45 PM IST
    Follow us on

    Acharya First Day Collections: టాలీవుడ్లో టాప్ హీరోల సినిమా విడుదలకు సిద్ధమైందంటే చాలు రికార్డులపైనే అందరి దృష్టి ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్లోని రిలీజైన బడా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లవర్షం కురిపిస్తున్నాయి. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు తొలిరోజే నుంచి రికార్డుల వేట మొదలు పెట్టి టాలీవుడ్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలుగా నిలిచాయి.

     

    ఇలాంటి సమయంలోనే ‘ఆచార్య’ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రెండు వేలకు థియేటర్లలో సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు బెనిఫిట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ రావడంతో ‘ఆచార్య’కు మైనస్ గా మారింది. అయినప్పటికీ మొదటి రోజు చిరంజీవి సినిమా వచ్చే కలెక్షన్లలో ‘ఆచార్య’కు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.

    తొలి రోజు నుంచే ‘ఆచార్య’పై కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు పనిగట్టుకొని విషం చిమ్ముతున్నాయి. చిరంజీవి, రాంచరణ్ నటన బాగుందంటూనే సినిమాను బూతాద్దంలో చూపి మరీ నెగిటీవీని స్ప్రెడ్ చేస్తున్నాయి. కుల మీడియా, టీడీపీ, వైసీపీ, నందమూరి ఫ్యాన్స్, మంచు ఫ్యామిలీలు ఏకమై ‘ఆచార్య’పై దుష్ప్రచారం చేస్తున్నారనే సందేహాలను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

    ‘ఆచార్య’పై ఎంత నెగిటీవినీ స్పెడ్ చేసినప్పటికీ తొలిరోజు మాత్రం నైజాంలో భారీ గానే కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజు భారీ వసూళ్లు సాధించిన పది చిత్రాల్లో ‘ఆచార్య’ ప్లేస్ దక్కించుకుంది. దీంతో ‘ఆచార్య’ మూవీ నైజాంలో తొలిరోజు ఎంతమేర కలెక్షన్లు సాధించిందనేది ఆసక్తికరంగా మారింది.

    నైజాంలో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల విషయానికొస్తే.. మొదటి ప్లేసులో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నిలుస్తోంది. ఈ మూవీ తెలంగాణలో తొలిరోజు రూ.23.35కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ప్లేసులో పవన్ కల్యాణ బీమ్లానాయక్ 11.44కోట్లు వసూలు చేసి ‘బాహుబలి-2’ రికార్డును చెరిపివేసింది.

    మూడో ప్లేసులో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ నిలిచింది. నైజాంలో ఈ మూవీ 11.44కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ 10.45కోట్లతో నాలుగోస్థానంలో, ‘సాహో’ 9.41కోట్లతో ఐదు, ‘బాహుబలి-2’ 8.9కోట్ల షేర్ సాధించాయి. అప్పటికీ ‘బాహుబలి-2’ మూవీదే అత్యధిక కలెక్షన్లు.

    పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ 8.75కోట్లతో ఏడో స్థానంలో, మహేష్ బాబు ‘సరిలేరునీకెవ్వరు’ 8.67కోట్లతో ఎనిమిదో స్థానంలో, చిరంజీవి ‘సైరా నర్సింహారెడ్డి’ 8.10కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలింది. తాజాగా రిలీజైన ‘ఆచార్య’ 7.90కోట్లతో పదో స్థానంలో నిలిచాయి.

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, చిరంజీవి నటించిన చిత్రాన్ని ఇంత తక్కువలో కలెక్షన్లు రావడానికి నెగిటీవీటినే కారణంగా తెలుస్తోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’.. ‘పుష్ప’కు కూడా తొలుత నెగిటీవ్ టాక్ వచ్చింది. అయినా ఆ చిత్రాలు భారీ కలెక్షన్లు సాధించాయి. మరీ ‘ఆచార్య’ విషయంలో ఏం జరుగుతుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    Recommended Videos: