Acharya Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ‘ఆచార్య’ తొలిరోజు నుంచి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం కన్పిస్తోంది.
‘ఆచార్య’గా చిరంజీవి, సిద్ధగా రాంచరణ్, నీలాంబరిగా పూజా హెగ్డే కన్పించారు. 66ఏళ్ల వయస్సులో చిరంజీవి తన డాన్స్, ఫైట్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక రాంచరణ్ సిద్ధ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంది. అయితే అతడి పాత్రను చంపేయడం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.
దీనికి తోడు చిరంజీవి పాత్రకు జోడీ లేకపోవడం ‘ఆచార్య’కు మైనస్ గా మారింది. మాస్ కా బాప్ అయిన చిరంజీవిని దర్శకుడు కొరటాల శివ సరైన రీతిలో ప్రజెంట్ చేయలేకపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కొరటాల శివ తన సినిమాలో హీరో క్యారెక్టర్ ను చాలా కూల్ గా, సింపుల్ గా డైలాగ్స్ చెబుతుంటారు.
ఈ సినిమాలోనూ కొరటాల అదే మార్క్ ఫాలో అయ్యారు. అయితే చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా దర్శకుడు కథలో మార్పులు చేసి ఉంటే ‘ఆచార్య’ మరో లెవల్లో ఉండేది. చిరంజీవి సైతం దర్శకుడు కొరటాలపై నమ్మకంతో పూర్తిగా అతడు చెప్పినట్లే కథలో నటించినట్లు అర్థమవుతోంది.
ప్రేక్షకులు చిరు నుంచి కోరుకునే భారీ ఎక్స్ పర్టేషన్స్ ఈ మూవీలో లేకపోవడమే ‘ఆచార్య’కు పెద్ద మైసస్ గా మారినట్లు తెలుస్తోంది. చిరంజీవి తన ప్లాపు సినిమాల్లోనూ తన మార్క్ ఎనర్జీ, కామెడీతో అభిమానులను అలరించేవారు. అయితే ఈ మూవీలో మాత్రం ‘ఆచార్య’ పాత్ర చాలా నిస్సారంగా ఉండటం అభిమానులను నిరాశకు గురిచేసింది.
రాంచరణ్ పాత్ర సినిమాకు హైలెట్ గా కన్పించినా అతడి పాత్రను చంపేయడం మైనస్ గా మారింది. కథలో బలం లేకపోయినప్పటికీ చిరంజీవి, రాంచరణ్ తమ నటన, డాన్స్, ఫైట్స్ తో కొంతమేర సినిమాను నిలబెట్టారు. కాగా ‘ఆచార్య’ చిరు మార్క్ మ్యానరిజం మిస్సవడమే సినిమాకు పెద్ద మైనస్ గా మారిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.
Also Read: Acharya: ‘ఆచార్య’ ప్లాప్ కి కారణాలు ఇవే.. అవును భయ్యా ఇవి నిజమే !
అయితే మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ను ఒకే స్క్రీన్ ప్లే చూడాలనే మెగా అభిమానులకు మాత్రం ‘ఆచార్య’ విందుభోజనాన్ని పంచడం ఖాయంగా కన్పిస్తోంది. ‘ఆచార్య’ సినిమా మొత్తానికి ‘బంజార బంజార’ సాంగ్, క్లైమాక్స్ సీన్ అద్భుతమని మెగా ఫ్యాన్స్ కితాబిస్తున్నారు.
Recommended Videos: