https://oktelugu.com/

నందమూరి హీరోలు ఇక ఎప్పుడు మారతారో ?

నందమూరి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కి తప్ప, మిగతా వారికి లౌక్యం తెలియదా.. వారి సినిమాల ఎంపికను, డైరెక్టర్ లను ఎన్నుకోవడాన్ని చూస్తే.. అలాగే అనిపిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ కుటుంబం నుండి వచ్చిన హీరో.. నిజానికి కళ్యాణ్ రామ్ ప్లేస్ లో మరో హీరో ఉంటే.. ఈజీగా స్టార్ హీరో అనే బ్రాండ్ ను క్రియేట్ చేసుకునే వాడు. కానీ, కళ్యాణ్ రామ్ మొదటినుండి సామాన్యమైన హీరోగానే తనను తాను ఎలివేట్ చేసుకుంటూ చివరకు […]

Written By:
  • admin
  • , Updated On : October 14, 2020 / 12:46 PM IST
    Follow us on


    నందమూరి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కి తప్ప, మిగతా వారికి లౌక్యం తెలియదా.. వారి సినిమాల ఎంపికను, డైరెక్టర్ లను ఎన్నుకోవడాన్ని చూస్తే.. అలాగే అనిపిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ కుటుంబం నుండి వచ్చిన హీరో.. నిజానికి కళ్యాణ్ రామ్ ప్లేస్ లో మరో హీరో ఉంటే.. ఈజీగా స్టార్ హీరో అనే బ్రాండ్ ను క్రియేట్ చేసుకునే వాడు. కానీ, కళ్యాణ్ రామ్ మొదటినుండి సామాన్యమైన హీరోగానే తనను తాను ఎలివేట్ చేసుకుంటూ చివరకు స్టార్ హీరో కాకుండానే.. జస్ట్ హీరోగా మిగిలిపోయాడు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కి కథలను ఎంపిక చేసుకోవడం గానీ, కాంబినేషన్ లను సెట్ చేసుకోవడం గానీ అసలు తెలియదేమో.

    Also Read: కోరిక తీరకుండానే కన్నుమూసిన నృత్య మహారాణి !

    లేకపోతే.. నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ లాంటి వారే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ను సెట్ చేసుకుంటే.. భారీ సపోర్ట్ ఉన్న కళ్యాణ్ రామ్ మాత్రం.. ఊరు పేరు లేని వారితోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక మరో నందమూరి హీరో తారకరత్న గురించి చెప్పుకోవడమే అనవసరం.. ఏకంగా తొమ్మిది సినిమాలకు సైన్ చేసి.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు అందుకోలేకపోతున్నాడు. ఇక బాలయ్య బాబు గురించి తెలిసిందే. ఆయనకు అసలు కథల పైనే జడ్జ్ మెంట్ లేదనే రూమర్ ఉంది. సరైన కథలను ఎలాగూ బాలయ్య పట్టుకొడు కాబట్టి, కనీసం డైరెక్టర్ లను అయినా స్టార్స్ ను పట్టుకుంటాడా అంటే.. ఆది లేదు.

    Also Read: ‘రామాయణం’లో.. రాముడిగా మహేష్ రావణుడిగా ఎన్టీఆర్ ?

    సరైన వాళ్లను పెట్టుకోకపోతే ప్లాప్స్ వస్తాయని గత అనుభవం చెబుతున్నా బాలయ్య మాత్రం బ్లైండ్ గానే ముందుకు వెళ్తాడు. అందుకే ఆయన ఎక్కువగా ఫామ్ లో లేని డైరెక్టర్స్ తో అలాగే విషయం లేని డైరెక్టర్స్ తోనే పని చేశాడు. ఇప్పుడు బాలయ్య బి.గోపాల్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి గోపాల్ తో బాలయ్య మళ్ళీ సినిమా చేస్తానంటే.. బాలయ్య అభిమానులు కూడా భయపడే పరిస్తితి ఉంది ప్రస్తుతం. అయినా బాలయ్య మాత్రం తన నిర్ణయం మార్చుకోడు. మనం చేస్తున్న కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా..? లేదా ? అని నందమూరి హీరోలు ఎప్పుడు ఆలోచించుకుంటారో ఏమో. ఎప్పుడో సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయిన డైరెక్టర్ లతో, ఊరు పేరు తెలియని డైరెక్టర్ లతో కాకుండా.. మంచి క్రేజ్ ఉన్న వారితో సినిమాలు చేస్తే.. సినిమాకి మంచి మార్కెట్ అవుతొంది. పైగా సినిమా సినిమాకి స్టార్ డమ్ పెరుగుతుంది. మరి ఇప్పటికైనా ఆ దిశగా నందమూరి హీరోలు మారాలని ఆశిద్దాం.