https://oktelugu.com/

ఎంటట్మైనెంట్ పక్కా.. సెట్స్ పైకి మారుతి-రవితేజ కాంబో..!

  టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో సెట్టయింది. త్వరలోనే దర్శకుడు మారుతి.. మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది. ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో ‘జీఏ2’.. ‘యూవీ క్రియేషన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పక్కా ఎంటటైనర్ గా ఈ మూవీగా రాబోతున్నందనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. Also Read: నందమూరి హీరోలు ఇక ఎప్పుడు మారతారో ? ప్రస్తుతం రవితేజ ‘కాక్’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రవితేజకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2020 / 12:49 PM IST
    Follow us on

     

    టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో సెట్టయింది. త్వరలోనే దర్శకుడు మారుతి.. మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది. ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో ‘జీఏ2’.. ‘యూవీ క్రియేషన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పక్కా ఎంటటైనర్ గా ఈ మూవీగా రాబోతున్నందనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

    Also Read: నందమూరి హీరోలు ఇక ఎప్పుడు మారతారో ?

    ప్రస్తుతం రవితేజ ‘కాక్’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రవితేజకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఈ మూవీతోపాటు రవితేజ వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటైయ్యాడు. ఇటీవలే మారుతి చెప్పిన కథ రవితేజకు నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మారుతి.. రవితేజ సినిమాలన్నీ వినోదభరితంగా ఉంటాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    ‘క్రాక్’ సినిమా పూర్తయిన వెంటనే మారుతి-రవితేజ కాంబోలో సినిమా ప్రారంభం కానుందట. ఈ మూవీ రవితేజ పవర్ పుల్ లాయర్ పాత్రలో కన్పించబోతున్నాడని సమాచారం. ‘జాలీ ఎల్ఎల్బీ’తో ఈ మూవీ రాబోతుందనే టాక్ విన్పిస్తోంది. అందరినీ న‌వ్విస్తూ.. ఆలోచింప‌జేసే క‌థతో మారుతి-రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

    Also Read: బిగ్ బాస్-4: ఇద్దరిని లైన్లో పెడుతున్న అవినాష్.. అవమానించిన దివీ..!

    మారుతీ-రవితేజ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ మూవీ డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈమేరకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులపై అధికారిక ప్రకటన చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతుంది. మారుతి-రవితేజ కాంబో పక్కా ఎంటట్మైంట్ గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. వీరి ఆశలను ఈ కాంబో ఏమేరకు అలరిస్తుందో వేచిచూడాల్సిందే..!