https://oktelugu.com/

జగన్ తీవ్ర ఆరోపణ: చంద్రబాబు మౌనం వెనుక కారణమేంటి..?

చంద్రబాబు.. ఆయనో మోస్ట్‌ సీనియర్‌‌ లీడర్‌‌. ఆయన ఏది మాట్లాడిన అది చర్చకు దారితీస్తూనే ఉంటుంది. ఆయన కూడా ఏదీ ఊరికే మాట్లాడరు. దశాబ్దాల నాటి చరిత్ర కలిగిన రాజకీయ నేత కాబట్టి ఎక్కువ మాట్లాడాలో.. మరెక్కడ మౌనంగా ఉండాలో బాగానే తూకమేసుకుంటారు. అలాగే ఆయన సైలెంట్‌గా ఉన్నారంటే కూడా ఏదో పెద్ద ఆంతర్యమే ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు మీద ముఖ్యమంత్రి జగన్ డైరెక్టుగా పెద్ద అభాండమే మోపారు. వ్యవస్థలను ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2020 / 12:42 PM IST
    Follow us on

    చంద్రబాబు.. ఆయనో మోస్ట్‌ సీనియర్‌‌ లీడర్‌‌. ఆయన ఏది మాట్లాడిన అది చర్చకు దారితీస్తూనే ఉంటుంది. ఆయన కూడా ఏదీ ఊరికే మాట్లాడరు. దశాబ్దాల నాటి చరిత్ర కలిగిన రాజకీయ నేత కాబట్టి ఎక్కువ మాట్లాడాలో.. మరెక్కడ మౌనంగా ఉండాలో బాగానే తూకమేసుకుంటారు. అలాగే ఆయన సైలెంట్‌గా ఉన్నారంటే కూడా ఏదో పెద్ద ఆంతర్యమే ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు మీద ముఖ్యమంత్రి జగన్ డైరెక్టుగా పెద్ద అభాండమే మోపారు. వ్యవస్థలను ఆయన తన చేతుల్లోకి తీసుకుని ఆటాడిస్తున్నారు అన్నది జగన్ ప్రధాన ఆరోపణ.

    Also Read: వంగవీటి రాధాను అందుకే లైట్‌ తీసుకుంటున్నారా..?

    అయితే.. దీనిపై చంద్రబాబు కూడా పెద్దగా ఏమీ స్పందించలేదు. సైలెంట్ అయ్యారు. ఆయన అమరావతి రాజధాని కోసం ఉద్యమించాలి అని ప్రతిరోజూ పిలుపు ఇస్తున్నారు. అదే సమయంలో జగన్ సర్కార్ ఏమీ చేయలేదని విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ ఆయన అసలు విషయం మాత్రం చెప్పడంలేదు. జగన్ పెట్టిన చిచ్చు చిన్నది కాదు కదా. మరోవైపు ఏకంగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మొత్తం తన అనుమానాలూ సందేహాలు ఒక లేఖ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్య పాత్రధారుడు చంద్రబాబు అన్నది లోకానికి తెలుసు. మరి చంద్రబాబు దీని మీద ‘నా తప్పు లేదనో, నన్నెందుకు జగన్ ఇరికిస్తున్నాడు’ అనో గట్టిగా మాట్లాడాలి కదా. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు.

    ఈ విషయాన్ని పట్టించుకొని సీరియస్‌గా స్పందించాల్సిన చంద్రబాబు.. ఏదేదో టాపిక్ మీద మాట్లాడుతున్నారే కానీ.. దీనిని పెద్దగా స్పందించడం లేదు. అయితే రాజకీయ చాణక్యుడు కాబట్టి పెదవి దాటనీయకుండా జాగ్రత్తపడుతూ ఉంటారని అంటున్నారు. ఇక ఈ సమయంలో తాను బయటపడి రచ్చ చేసినా విమర్శలు చేసినా భుజాలు తడుముకున్నట్లుగా ఉంటుందన్న అతి తెలివితోనే చంద్రబాబు తన నోటికి తాళం వేసుకుని ఉండొచ్చు అన్న మాట కూడా ఉంది. అదేవిధంగా తాను ఎందుకు బయటపడాలి. జగన్ లేఖ రాసింది తనకు కాదు, ఆరోపణలు వేరే వారి మీద చేశారు. అక్కడ తీర్పు ఎలా వస్తుందో తెలియదు.

    ఇక జగన్ దూకుడు రాజకీయం చంద్రబాబుకు బాగా తెలుసు. కానీ మరీ ఇంతలా ఆయన ఇలాంటి అభాండం వేస్తారని బాబు ఊహించి ఉండరు. ఈ దెబ్బకు చంద్రబాబు షాక్‌ గురయ్యారా.. లేక దీనిపై ఎందుకు స్పందించడం.. ఎందుకు రాద్ధాంతం చేయడం అని అనుకుంటున్నారో తెలియడం లేదు. ఏది ఏమైనా జగన్ తెచ్చిపెట్టిన ఈ చిచ్చు చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి మరి. అంత పెద్ద ఆరోపణల నుంచి చంద్రబాబు కూడా ఎలా బయటపడుతారో కాలమే నిర్ణయిస్తుందేమో.