Trivikram Prabhas Movie : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఈయన ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించుకున్నారు. ఆ తర్వాత తీసిన రాఘవేంద్ర సినిమా అంత పెద్దగా ఆడకపోయినా వర్షం సినిమా తో మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించాడు. అప్పటి నుంచి ఆయన ఒక మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన చత్రపతి సినిమాతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రభాస్ ఇప్పటివరకు చాలామంది స్టార్ డైరెక్టర్లతో నటించినప్పటికీ ప్రభాస్ అభిమానులు కోరుకునే కాంబో ఏంటి అంటే ప్రభాస్ త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు చేస్తాడు అని చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ తో రాసే డైలాగులు ప్రభాస్ చెప్తే చాలా అద్భుతంగా ఉంటుందని ఆయన అభిమానులు చాలా సంవత్సరాల నుంచి ఈ కాంబో కోసం ఎదురు చూస్తున్నారు.
అయినప్పటికీ ఈ కాంబో మాత్రం సెట్ కావట్లేదు ఏంటి అనేది తెలియదు కానీ ఈ కాంబో మీద మాత్రం ఫ్యాన్స్ లోనే కాకుండా సినిమా అభిమానుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు కాబట్టి వీళ్ళిద్దరి కాంబోలో ఒక మంచి సినిమా పడితే మాత్రం అది షుర్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అని అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.ముఖ్యంగా త్రివిక్రమ్ పంచులు గాని ఆయన టైప్ ఆఫ్ మేకింగ్ గాని ప్రభాస్ కి చాలా బాగా సెట్ అవుతుంది. అందుకే ఈ కాంబినేషన్ పైన ఫ్యాన్స్ లోనే కాకుండా నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. త్రివిక్రమ్ ప్రభాస్ తో సినిమా అనే టాపిక్ ని ఇంతవరకు ఎప్పుడు కూడా తీసుకురాలేదు. ఆయన ఎప్పుడు అల్లు అర్జున్ ,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లతో మాత్రమే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటాడు.అయితే ఒకవేళ ఈ కాంబోలో సినిమా కనక వస్తే సూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కాంబో ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు కానీ ఫ్యూచర్ లో మాత్రం పక్కగా ఈ కాంబో లో సినిమా వస్తుంది… అభిమానులు కోరుకున్నట్టుగానే ఈ కాంబోలో సినిమా రావడమే కాకుండా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా కూడా నిలుస్తుందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…