https://oktelugu.com/

NTR : ఏకంగా ఎన్టీఆర్ పక్కన నటించిన ఈ స్టార్ లేడీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే ఆశ్చర్యపోతారు!

40 ఏళ్ల మంజరి ఇప్పటికీ యంగ్ గ్లామరస్ లుక్ మైంటైన్ చేస్తుంది. ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. మంజరీ వీడియోలు, ఫోటోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 3, 2024 / 09:54 PM IST

    Manjari Phadnis

    Follow us on

    NTR : టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన ఎన్టీఆర్ తో జతకట్టిన హీరోయిన్ ని ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆమె టాలీవుడ్ కి దూరమై దశాబ్దం దాటిపోయింది. ఎన్టీఆర్ నటించిన ఆ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ అయితే ఆమె కెరీర్ ఏమైనా మలుపు తిరిగేదేమో. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

    మహారాష్ట్రకు చెందిన మంజరి ఫడ్నిస్ ‘రోక్ సకో తో రోక్ లో’ అనే ఓ బాలీవుడ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 2004లో విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం ఫాల్తు టైటిల్ తో ఓ బెంగాలీ చిత్రం చేసింది. ముంబై సల్సా, జానే తు యా జానీ నా అనే హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో మంజరి మొదటి చిత్రం సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. నరేష్ హీరోగా నటించిన ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

    ఈ చిత్రంలో శ్రద్దా దాస్ సెకండ్ హీరోయిన్ గా చేయడం విశేషం. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీలో మంజరి హోమ్లీ లుక్ లో మెస్మరైజ్ చేసింది. తెలుగులో అమ్మడు ఊపేయడం ఖాయమని అనుకున్నారు. అందం, అభినయం ఉన్నా కూడా మంజరికి కాలం కలిసి రాలేదు. లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ తెరకెక్కించిన శుభప్రదం మూవీలో మంజరి హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రంలో కూడా అల్లరి నరేష్ తో జతకట్టింది. శుభప్రదం డిజాస్టర్ కావడం ఊహించని పరిణామం.

    మంజరికి తెలుగులో దక్కిన బంపర్ ఆఫర్ శక్తి. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన సోషియో ఫాంటసీ శక్తి మూవీలో మంజరి సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశాడు. తండ్రి ఎన్టీఆర్ పాత్రకు భార్యగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంజరి కనిపిస్తుంది. అయితే శక్తి మూవీలో మంజరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. శక్తిలో ఇలియానా ప్రధాన హీరోయిన్. నిర్మాత అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో శక్తి తెరకెక్కించాడు.

    శక్తి టాలీవుడ్ బడా డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. నిర్మాత అశ్వినీ దత్ పెద్ద మొత్తంలో నష్టపోయాడు. శక్తి ఫలితం బెడిసి కొట్టాక మంజరి పూర్తిగా టాలీవుడ్ కి దూరమైంది. ఆమె హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎక్కువ నటిస్తుంది. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అత్యంత ఆదరణ పొందుతున్న నేపథ్యంలో వెబ్ సిరీస్ల మీద ఫోకస్ పెట్టింది. ఫుహ్ సే ఫాంటసీ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇది ఊట్ లో స్ట్రీమ్ అయ్యింది.

    మసూమ్, మియా బీవీ ఔర్ మర్డర్, ఫ్రీలాన్సర్ సిరీస్లలో నటించి మెప్పించింది. మంజరి ఇంకా వివాహం చేసుకోలేదు. ఆమె అడపాదడపా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు వెళుతుంది. ఆమె ప్రధాన పాత్ర చేసిన చల్తీ రహతే జిందగీ మూవీ జులై 26న జీ 5లో విడుదలైంది. ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసింది మంజరి. ప్రస్తుతం జీ 5లో చల్తీ రహతే జిందగీ ట్రెండ్ అవుతుంది.

    40 ఏళ్ల మంజరి ఇప్పటికీ యంగ్ గ్లామరస్ లుక్ మైంటైన్ చేస్తుంది. ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. మంజరీ వీడియోలు, ఫోటోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. మంజరి ఇంస్టాగ్రామ్ ని నాలుగు లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు. మంజరి ప్రస్తుతం ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్ వేయండి.