Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ షోకి వెళ్లడం చాలా మంది కల. ఇక సామాన్యుడు హౌస్లో అడుగుపెట్టడం అంత సులభం కాదు. ప్రతి సీజన్ కి 20 మంది మాత్రమే కంటెస్టెంట్స్ గా ఎంపిక అవుతారు. వారిలో ఒక్కరు లేదా ఇద్దరు కామనర్స్ ఉంటారు. కొన్ని సీజన్స్ లో సామాన్యులకు చోటు దక్కదు. కాగా ఒక కామనర్ బిగ్ బాస్ షోలోకి వెళితే ఎంత చెల్లిస్తారో తెలుసా?
బిగ్ బాస్ అత్యంత పాప్యులర్ రియాలిటీ షో. సెలెబ్రిటీల వాస్తవ ప్రవర్తనను కెమెరాలలో బంధించి చూపించే బిగ్ బాస్ అంటే ఓ వర్గం ప్రేక్షకులు పడి చేస్తారు. ఒక సీజన్ ముగిశాక మరొక సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తారు. బిగ్ బాస్ షోకి ఎంపికైతే అదృష్టం అని భావించే వారు లేకపోలేదు. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడితే సీన్ మారిపోతుంది. గతంలో ఎలాంటి గుర్తింపు లేనివారు అనతి కాలంలో ఇమేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ షోతో వచ్చే ఫేమ్ తో బయటకు వచ్చాక భారీగా ఆర్జించవచ్చు. ఆఫర్స్ రాబట్టవచ్చు.
బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక అభిమానులు ఏర్పడతారు. సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ పేర్లు జపం చేస్తారు. హౌస్లో అడుగుపెట్టాలని ఎందరికి ఉన్నా… సీజన్ కి 20 లేదా 21 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఈ 20 మందిలో ఒకరిద్దరు సామాన్యుల కోటాలో హౌస్లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకోవచ్చు. తెలుగులో గణేష్ అనే యంగ్ ఫెలో సీజన్ 2లో కామనర్ గా హౌస్లో అడుగుపెట్టాడు.
అలాగే నూతన్ నాయుడు, ఆదిరెడ్డి, గీతూ రాయల్, పల్లవి ప్రశాంత్ ఈ లిస్ట్ లో ఉన్నాడు. వీరిలో పల్లవి ప్రశాంత్ సంచలనం సృష్టించాడు. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుంది. కానీ ఓ కామనర్ బిగ్ బాస్ టైటిల్ కొట్టిన దాఖలాలు లేవు. పల్లవి ప్రశాంత్ ఈ రికార్డు నెలకొల్పాడు. ఇది ఎవరు ఊహించని పరిణామం.
బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ పొందాడు. యావర్ రూ. 15 లక్షలు తీసుకుని రేసు నుండి తప్పుకోవడంతో విన్నర్ ప్రైజ్ మనీ తగ్గింది. ఓ కారు, డైమండ్ నెక్లెస్ కూడా పల్లవి ప్రశాంత్ సొంతం అయ్యాయి. వాటి విలువ రూ. 30 లక్షలు అని సమాచారం. 15 వారాలు హౌస్లో ఉన్న పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ రూపంలో మరికొంత ఆర్జించాడు. కాగా బిగ్ బాస్ హౌస్లో ఒక కామనర్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి లీక్ చేశాడు.
బిగ్ బాస్ రివ్యూవర్ అయిన ఆదిరెడ్డి సీజన్ 6లో కంటెస్ట్ చేశాడు. అతడు ఫైనల్ కి వెళ్ళాడు. 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 15 వారాలు ఉన్న ఆదిరెడ్డికి రూ. 25-30 లక్షలు రెమ్యూనరేషన్ గా ముట్టాయట. అంటే వారానికి దాదాపు రూ. 2 లక్షలు ఆదిరెడ్డికి బిగ్ బాస్ నిర్మాతలు చెల్లించారు. కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యాక రెమ్యూనరేషన్ బేరసారాలు జరుగుతాయట. టాప్ సెలెబ్స్ అధికంగా డిమాండ్ చేస్తారు. మరి ఆదిరెడ్డికే రూ. 30 లక్షలు ఇస్తే… హీరోలు, హీరోయిన్స్, బుల్లితెర నటులు భారీగానే ఆర్జిస్తారని తెలుస్తుంది.
కాగా కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కంటెస్టెంట్ ఫేమ్, ఫాలోయింగ్, డిమాండ్ చేసిన తీరుపై ఆధారపడి ఉంటుంది. ఆదిరెడ్డి చెప్పిన ప్రకారం పల్లవి ప్రశాంత్ సైతం రెమ్యూనరేషన్ గా రూ. 30 లక్షలకు తగ్గకుండా తీసుకుని ఉంటాడు. అంటే రైతుబిడ్డ దాదాపు ఒకటి కోటి ఆర్జించాడు.