Pushpa 2: సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందనే ఉద్దేశంతో డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు…ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ ని కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీగా కష్టపడుతూ భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని అందుకుంది అలాగే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డును కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఇప్పుడు వస్తున్న ‘పుష్ప 2’ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం అల్లు అర్జున్ పూర్తి ఫోకస్ ని ఈ సినిమా మీద పెట్టాడు అలాగే సుకుమార్ కూడా ఒక్కొక్క సీన్ ను దగ్గరుండి మరి తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ రీషుట్ కూడా చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు భారీగా ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా అనుకున్న డేట్ కి వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా మరోసారి వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు కనక ఆ సినిమా అనుకున్న డేట్ కి రాకపోతే సినిమా మీద ఉన్న అంచనాలు మరింత తగ్గిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇప్పటికే ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మీద విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టారు. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ అయి 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడితే తప్ప ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ లో ఉండరనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు ఈ సినిమా మీద 600 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సుకుమార్ తన మ్యాజిక్ తో ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడని అందరూ భావిస్తున్నారు.
అలాగే అల్లు అర్జున్ అభిమానులు కూడా సుకుమార్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక సుకుమార్ మాత్రం ఎలాగైనా సరే పుష్ప 2 సినిమాను సక్సెస్ చేసి తన రేంజ్ ను మరింత విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో అటు అల్లు అర్జున్ ఇటు సుకుమార్ ఇద్దరు భారీ సక్సెస్ ని అందుకుంటారా లేదా అనేది…