https://oktelugu.com/

Indra Movie Re Release: ‘భోళా శంకర్’ ని దాటేసిన ‘ఇంద్ర’ రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లు..మెగాస్టార్ వింటేజ్ మాస్ అంటే ఇది!

ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి చిత్రాలలో ఘోరమైన ఫ్లాప్ సినిమా ఏమిటి అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు 'మృగరాజు'. అప్పట్లో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, ఓపెనింగ్స్ విషయం లో మాత్రం పోటీ లో ఉన్న నరసింహనాయుడు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 23, 2024 12:33 pm
    Indra Movie Re Release

    Indra Movie Re Release

    Follow us on

    Indra Movie Re Release: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత తన రేంజ్ కి తగ్గ సినిమాలు చెయ్యడం లేదని అభిమానులు బాధపడుతూ ఉంటారు. అదేంటి రీ ఎంట్రీ తర్వాత మూడు వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలను ఇచ్చాడు కదా, ఇలా అంటున్నాడేంటి అని అనుకోకండి. చిరంజీవి రేంజ్ సినిమాలు అంటే ‘ఇంద్ర’ ,’ఠాగూర్’ లాంటి సినిమాలు అన్నమాట. ఆ స్థాయి సినిమాలు రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చేయలేదు అనేది వాస్తవమే. మామూలు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసాడు. అవి మెగాస్టార్ స్టామినా వల్ల సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చేసిన ఆరు సినిమాలలో రెండు అభిమానులను ఘోరంగా నిరాశ పర్చాయి. ఆ రెండు సినిమాలు ‘ఆచార్య’, ‘భోలా శంకర్’. భోళా శంకర్ చిత్రం అనేక ప్రాంతాలలో ఒకప్పటి చిరంజీవి డిజాస్టర్ సినిమాల వసూళ్లను కూడా అందుకోలేకపోయాయి.

    ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి చిత్రాలలో ఘోరమైన ఫ్లాప్ సినిమా ఏమిటి అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ‘మృగరాజు’. అప్పట్లో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, ఓపెనింగ్స్ విషయం లో మాత్రం పోటీ లో ఉన్న నరసింహనాయుడు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమాకి 48 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘భోళా శంకర్’ కి మాత్రం కేవలం 26 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలాగే ఇంద్ర రీ రిలీజ్ లో మొదటి రోజు అదే ప్రాంతంలో 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే, భోళా శంకర్ కేవలం మొదటి రోజు 9 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అంటే ఇంద్ర రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్ళలో కనీసం సగం కూడా రాబట్టలేకపోయింది అన్నమాట.

    దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, మెగాస్టార్ తన రేంజ్ ని ఎలాంటి చెత్త సినిమాలకు ఉపయోగించాడో అని. ఇకపోతే ఇంద్ర చిత్రానికి కర్ణాటక, ఓవర్సీస్ మరియు చెన్నై ప్రాంతాలలో ఆల్ టైం రికార్డ్స్ వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దాదాపుగా మొదటి రోజు 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఫుల్ రన్ లో 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దగ్గర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉన్నప్పటికీ కూడా ఇంద్ర ఈ స్థాయి వసూళ్లను రాబట్టింది అంటే, ఆ సినిమాకి ఉన్న విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రం చేస్తున్నాడు. ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. సోషియో ఫాంటసీ జానర్ లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు.