Samyuktha Menon: హీరోయిన్ సంయుక్త మీనన్ ని ఉద్దేశపూర్వకంగానే ఆ డైరెక్టర్ తొక్కేసాడా..? మరీ ఇంత దారుణమా!

టాలెంట్ ఉన్న వాళ్లకు ఈ భాషలో కాకపోతే ఏ భాషలో అయినా సినిమా అవకాశాలు వస్తాయి. డైరెక్టర్ సందీప్ వంగ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ 'తెలుగు సినిమా ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేస్తే నేను బాలీవుడ్ కి వెళ్ళిపోతా..అక్కడ కూడా బ్యాన్ చేస్తే హాలీవుడ్ కి వెళ్ళిపోతా..నా టాలెంట్ కి ఎవ్వరూ స్పీడ్ బ్రేకర్స్ వెయ్యలేరు' అని అంటాడు.

Written By: Vicky, Updated On : August 23, 2024 12:43 pm

Samyuktha Menon

Follow us on

Samyuktha Menon: చూపులు తిప్పుకోలేని అందం, అద్భుతమైన నటన ప్రతిభ, ఈ రెండు ఒకే హీరోయిన్ లో ఉండడం చాలా కష్టం. చాలా అరుదుగా అలాంటి హీరోయిన్లు ఉంటారు, అలాంటి వారిలో ఒకరు సంయుక్త మీనన్. మలయాళం లో టాప్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె, తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూలు కట్టాయి. ఆమె నటించిన ‘బింభిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ చిత్రాలు కమర్షియల్ గా సూపర్ హిట్స్ అవ్వడంతో టాలీవుడ్ పాలిట గోల్డెన్ లెగ్ గా మారింది. కానీ ఈ సినిమాల తర్వాత ఆమె చేసిన ‘డెవిల్’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

కానీ సంయుక్త మీనన్ కి మాత్రం మంచి పేరొచ్చింది. ఇలా కెరీర్ లో దూసుకుపోతున్న ఆమెకి అకస్మాత్తుగా బ్రేకులు పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ప్రస్తుతం ఈమె చేతిలో కేవలం ‘స్వయంభు’ అనే తెలుగు సినిమా మాత్రమే ఉంది. నిఖిల్ హీరో గా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ జానర్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇంత అందంగా ఉండే అమ్మాయికి తెలుగు లో కేవలం ఒక్క సినిమానేనా అని ఆమె అభిమానులు అంటున్నారు. ఆమె ఎదుగుదల కి ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ అడ్డు పడుతున్నాడని, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఆ స్టార్ డైరెక్టర్ సంయుక్త మీనన్ మీద మనసు పారేసుకుని ఆమె కోసం లెక్కలేనన్ని బహుమతులు తరచూ ఇచ్చేవాడని, ఆమె కమిట్మెంట్ ఇస్తుంది అనే ఆశతో ఇండస్ట్రీ లో పలు క్రేజీ మూవీస్ లో ఆఫర్స్ వచ్చేలా చేసాడని, కానీ సంయుక్త మీనన్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇప్పించిన సినిమా ఆఫర్స్ మొత్తం క్యాన్సిల్ చేయించాడని, అందుకే సంయుక్త మీనన్ కి తెలుగు లో ఆమె టాలెంట్ కి తగ్గ అవకాశాలు రావడం లేదని ఇండస్ట్రీ లో బలంగా వినిపిస్తున్న టాక్. ఒక అమ్మాయి ఇండస్ట్రీ లో నెట్టుకొని రావాలంటే బోలెడంత అదృష్టం ఉండాలి అని పెద్దలు అందుకే అంటూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి మృగాలను దారుకొని ఇండస్ట్రీ లో ఒక అమ్మాయి స్టార్ గా ఎదగడం అంత సులువైన విషయం కాదు.

అయితే టాలెంట్ ఉన్న వాళ్లకు ఈ భాషలో కాకపోతే ఏ భాషలో అయినా సినిమా అవకాశాలు వస్తాయి. డైరెక్టర్ సందీప్ వంగ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘తెలుగు సినిమా ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేస్తే నేను బాలీవుడ్ కి వెళ్ళిపోతా..అక్కడ కూడా బ్యాన్ చేస్తే హాలీవుడ్ కి వెళ్ళిపోతా..నా టాలెంట్ కి ఎవ్వరూ స్పీడ్ బ్రేకర్స్ వెయ్యలేరు’ అని అంటాడు. ఇప్పుడు సంయుక్త మీనన్ కూడా అదే విధంగా దూసుకుపోతుంది. తెలుగు లో ఆమెకి అవకాశాలు రాకపోయినా హిందీ లో, మలయాళం లో ఆమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి.