https://oktelugu.com/

Rathika Rose- Rahul Sipligunj: రతికా రోజ్, రాహుల్ సిప్లిగంజ్ విడిపోవడానికి కారణం ఏంటి?

వీరిద్దరి ప్రేమ 2019లో 'హే పిల్లా' అనే ఓ సాంగ్‌ రాహుల్ తీసినప్పుడే మొదలైందట. ఇందులో రతికా రోజ్ ఫీమేల్ లీడ్‌గా చేసింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 9, 2023 / 11:27 AM IST

    Rathika Rose- Rahul Sipligunj

    Follow us on

    Rathika Rose- Rahul Sipligunj: మరోసారి బుల్లితెర ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో పోయిన వారమే మన ముందుకు వచ్చింది. గత సీజన్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి బిగ్ బాస్ మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేసి మంచి కంటెస్టెంట్లను తీసుకో రాబోతున్నారని ఈ షో స్టార్ట్ అవ్వకముందు వార్తలు వచ్చాయి. కాగా షో మొదలయ్యాక మాత్రం ఈసారి కంటెస్టెంట్లు కూడా ముందులాగే ఉన్నారు అని కొన్ని సోషల్ మీడియా పేజెస్ కామెంట్లు పెడుతున్నాయి.

    ఇదిలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో అందరి దృష్టిని ఆకర్షించి హైలైట్ అవుతోంది రతికా రోజ్. మొదటి రోజు నుంచే ఈ అమ్మడు తన అందంతో అలానే తన యక్టివ్ పార్టిసిపేషన్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈమె తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఇప్పుడు ఆమె ప్రియుడు ఎవరు? అతడికి ఎందుకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది? అనే దాని పైన ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆ వివరాలను ఒకసారి చూద్దాం.

    ప్రీమియర్ ఎపిసోడ్‌లో రతికా రోజ్ తన మాజీ ప్రియుడి గురించి మాట్లాడిన తర్వాత అందరూ అతడు ఎవరా అని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఇంతకీ ఈమె లవర్ ఎవరు అని తెగ సర్చ్ చేయగా.. అతను మరెవరో కాదు బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ అని తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.

    వీరిద్దరి ప్రేమ 2019లో ‘హే పిల్లా’ అనే ఓ సాంగ్‌ రాహుల్ తీసినప్పుడే మొదలైందట. ఇందులో రతికా రోజ్ ఫీమేల్ లీడ్‌గా చేసింది. ఇక అప్పటి నుంచి వీరు కొన్నో రోజుల పాటు తమ ప్రేమని కొనసాగించారట. కాగా అదే సంవత్సరం జూలైలో ప్రారంభం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్ కి విన్నర్ గా కూడా నిలిచారు. కానీ బిగ్ బాస్ షోలోకి వెళ్లిన తర్వాత రతికా – రాహుల్ మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలిసింది. అప్పట్లో రాహుల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి తో చాలా క్లోజ్ గా ఉండటం మనం గమనించిన విషయమే.

    ప్రతి సీజన్లో బిగ్ బాస్ లో మనం ఎవరిదో ఒకరిది ప్రేమ కథ చూస్తూ ఉంటాం. ఇక రాహుల్ విన్నర్ అయిన సీజన్లో మనం రాహుల్, పునర్నవి భూపాలం మధ్య ప్రేమాయణం చూసి సంతోషించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేశాడట. అందుకే రతికా రోజ్.. రాహుల్ సిప్లీగంజ్‌కు దూరం అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

    అంతేకాదు డైరెక్టుగా రతిక రోజ్ తన మాజీ ప్రియుడు రాహుల్ సిప్లీగంజే అని చెప్పకపోయినా ఆమె చేస్తున్న కామెంట్లతో కన్ఫార్మెషన్ వచ్చేస్తుంది. ఇక బిగ్ బాస్ రతికా ని ఎవరినైనా మిస్ అవుతున్నావా అని అడగ్గా.. తన పేరెంట్స్ గురించి కాకుండా బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పింది. అంతేకాదు, చాలా ఏళ్ల నుంచి మిస్ అవుతున్నా అంది. మొత్తానికి ఏదో ఒక సందర్భంలో ఇన్ డైరెక్ట్ గా రాహుల్ ప్రస్తావన తీసుకొస్తూనే ఉంది రతిక. అంతేకాదు ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ తో క్లోజ్ గా ఉండటం కూడా తెగ వైరల్ అవుతోంది.