Site icon OkTelugu

Bigg Boss 7 Telugu Pallavi Prashanth: అమ్మాయి కాళ్ళ పైన పడ్డ.. చనిపోవాలి అనుకున్న… పల్లవి ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు..

Bigg Boss 7 Telugu Pallavi Prashanth

Bigg Boss 7 Telugu Pallavi Prashanth

Bigg Boss 7 Telugu Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటివారం కొంచెం హుషారుగా కొంచెం నెమ్మదిగా సాగుతూ పర్వాలేదు అనిపించుకుంది. ఇక లోపలికి వెళ్ళిన 14 కంటెస్టెంట్స్ లో కొంతమంది మొదటి వారమే మంచి గుర్తింపు పొందారు అందులో ఒకరు పల్లవి ప్రశాంత్.

యూట్యూబ్ లో రైతు బిడ్డగా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ కామన్ మాన్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ ఇతన్ని కామన్ మాన్ అన్నా కానీ ఇన్ స్టాగ్రామ్ లో 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న పల్లవి ప్రశాంత్ ఏ విధంగా కామన్ మ్యాన్ అవుతాడని కొంతమంది ప్రేక్షకులు మాత్రం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం రతికా రోజ్ తో క్లోజ్ గా ఉంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోకు వెళ్లకముందు ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చి అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఆయన పేరు గురించి చెబుతూ ఒక మొక్కు వల్లే నేను ఈ పేరు పెట్టుకున్నానని ఆయన పేర్కొన్నారు.బిగ్ బాస్ షోలోకి రైతు బిడ్డ ఎందుకు వెళ్లకూడదని ఆలోచించి నేను ముందడుగు వేశానని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు. అంతేకాదు తన తండ్రి తనకు ఎంతో ఎంతో సపోర్ట్ చేశారని ఆయన కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఆయన యూట్యూబ్ ఛానల్ విషయంలో ఒక అక్క మోసం చేసిందని చెప్పడం అందరి దృష్టిని ఆయన వైపు తిప్పుకుంది.

తనను మోసం చేసిన అమ్మాయి గురించి చెబుతూ..”ఆమె ప్రస్తుతం తెలంగాణలో ఫేమస్ అయిన వ్యక్తి. కానీ యూట్యూబ్ విషయంలో ఆమె దగ్గర నేను మోసపోయాను. అలా మోసపోయానని తెలిసి చనిపోవాలని అనుకున్నానను. నన్ను మోసం చెయ్యడమే కాకుండా, ఆమె ఆ తర్వాత కూడా నా గురించి చెడుగా మాట్లాడారని నాకు తెలిసింది” అని ఆయన చెప్పుకొచ్చారు.

నన్ను మోసం చేసి వాళ్లు ఒక మంచి మనిషిని కోల్పోయారని ఆయన తెలిపారు. నేను యూట్యూబ్ ఛానల్ పోగొట్టుకున్న తర్వాత భయపడ్డానని తెలియజేశారు. అంతేకాదు తను మోసపోయిన సమయంలో కూడా అతని తండ్రి ఆయన వెనకే ఉన్నారని.. చాలా వరకు తన వీడియోలు తన తండ్రి తీస్తారని..ఏ జన్మలో ఏదో పుణ్యం చేయడం వల్లే తనకు మంచి నాన్న దొరికారని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు.

Exit mobile version