Music Director: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్లందరు పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ దర్శకులుగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఓజా మూవీ సక్సెస్ లో మ్యూజిక్ అనేది కీలకపాత్ర వహిస్తుందనే విషయం మనందరికి తెలిసిందే. ఎందుకంటే సినిమాలోని మ్యూజిక్ ని బట్టి ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యద్భుతమైన మ్యూజిక్ ని అందించిన చక్రి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జూనియర్ ఇళయరాజా అంటూ అతని మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండేవారు. ఎన్నో గొప్ప సినిమాలకు సంగీతాన్ని అందించిన ఘనత కూడా తనకే దక్కింది.
అలాంటి చక్రి గురించి ప్రముఖ సంగీత దర్శకుడు అయిన రఘుకుంచే కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. తన ఆఫీసులో రోజుకు 40 మందికి అన్నం పెట్టేవాడు అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఏదేమైనా కూడా చక్రి ఓవర్ వెయిట్ వల్ల హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు.
నిజానికి ఆయన అలా కాకుండా డైట్ ని మెయింటైన్ చేసి ఉండి కొంచెం సన్నబడినట్లైతే అతను ఇప్పటికీ మంచి ఫిట్నెస్ తో ఉండేవాడు. అలాగే ఇండస్ట్రీలో కూడా తన మ్యూజిక్ తో మరిన్ని అద్భుతాలు చేసే అవకాశం ఉండేది అంటూ తెలుగు సినిమా విమర్శకులు సైతం అతని గురించి మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఆయన మ్యూజిక్ తో చాలా సినిమాలు సక్సెస్ ని సాధించాయి.
అలాగే చాలా ఆల్బమ్స్ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. చక్రి మ్యూజిక్ నుంచి సాంగ్స్ వస్తున్నాయి అంటే ప్రేక్షకులందరు ఆ సాంగ్ కోసం విపరీతంగా ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అంటూ అతని సన్నిహితులతో పాటు అభిమానులు కూడా బాధపడుతున్నారు…