Kantara 2: సినిమాల వల్ల చాలామంది ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతున్నారు. ఒక సగటు ప్రేక్షకుడు సినిమాని చూసినప్పుడు రెండున్నర గంటలపాటు ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయి వాళ్లకున్న బాధలను మరిచిపోయి ఎంజాయ్ చేస్తాడు. కాబట్టే ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తుంటారు. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలకి దేవుడుని కనెక్ట్ చేసి భక్తి భావంతో ఉన్నవాళ్ళని సైతం థియేటర్లకు రప్పిస్తున్నారు. అలాగే సినిమాను సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నారు. గతంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో ‘కాంతార’ సినిమా వచ్చింది. ఈ మూవీ పాన్ ఇండియాలో ఎంత గొప్ప సక్సెస్ ను సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… పాన్ ఇండియాలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇక ఆ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు ‘కాంతార 2’ సినిమా చేశారు. ఇక రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నప్పటికి కాంతార మొదటి పార్ట్ లో ఏదైతే హైలెట్ అయిందో రెండో పార్ట్ లో అదే మైనస్ గా మారింది…
మొదటి పార్ట్ లో అడవి ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య కనిపించిన ఎమోషన్ సన్నివేశాలు, అలాగే గులిగా దేవుడి పాత్ర ను క్రియేట్ చేసిన విధానం హైలెట్ అయ్యాయి. ఇక రెండో పార్ట్ లో అలాంటి సన్నివేశాలు కనిపించలేదు. ఇక మొదటి పార్ట్ సక్సెస్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ చేయాలని అనుకున్నారు.
మొదటి పార్ట్ కి వచ్చిన హైప్ ను వాడుకోవాలని చూశారు. అంతే తప్ప ఈ సినిమాకి అసలు మొదట్లో సీక్వెల్ చేసే ఆలోచనే లేదు. ఇక మొదటి పార్ట్ లో హీరోకి దేవుడు ఆవహించిన తర్వాత వచ్చే సీన్స్ బాగున్నాయి. సెకండ్ పార్ట్ క్లైమాక్స్ లో మొదటి పార్ట్ లోని ‘వరాహ రూపం’ సాంగ్ ను వాడుకున్నారు.
అయినప్పటికి ఇక్కడంతా ఎమోషనల్ గా అనిపించలేదు. అలాగే అంత ఇంటెన్స్ కూడా రాలేదు. ఇక సెకండ్ పార్ట్ లో దేవుడిని చాలా హైలెట్ చేసి చూపించాల్సింది కానీ అలా చూపించలేకపోయారు… దానివల్లే కాంతార మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ సెకండ్ పార్ట్ కి రావడం లేదు…