NTR- Sridevi: శ్రీదేవి జీవితంలో ఎన్టీఆర్ చెప్పిందే జరిగింది.. ఇంతకీ ఏమిటో తెలుసా అది ?

NTR- Sridevi: మహా నటుడు ఎన్టీఆర్‌ సినీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ఆయన ఒక నటిని ఈమె స్టార్ అవుతుంది అంటే కచ్చితంగా ఆ నటి గొప్ప స్టార్ అయ్యేది. దీనికితోడు ఎన్టీఆర్ సరసన అలనాటి అందాల తారలు ఎందరో నటించారు. వారికి ఎన్టీఆర్ గారు తగిన జాగ్రత్తలు చెబుతూ.. జీవితం పట్ల, వృత్తి పట్ల ఎంతో క్రమశిక్షణను నేర్పుతూ ఉండేవారు. ఐతే, ఎన్టీఆర్ గారు శ్రీదేవితో కూడా అనేక సినిమాలు చేశారు. చిన్న […]

Written By: Shiva, Updated On : July 23, 2022 4:13 pm
Follow us on

NTR- Sridevi: మహా నటుడు ఎన్టీఆర్‌ సినీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ఆయన ఒక నటిని ఈమె స్టార్ అవుతుంది అంటే కచ్చితంగా ఆ నటి గొప్ప స్టార్ అయ్యేది. దీనికితోడు ఎన్టీఆర్ సరసన అలనాటి అందాల తారలు ఎందరో నటించారు. వారికి ఎన్టీఆర్ గారు తగిన జాగ్రత్తలు చెబుతూ.. జీవితం పట్ల, వృత్తి పట్ల ఎంతో క్రమశిక్షణను నేర్పుతూ ఉండేవారు. ఐతే, ఎన్టీఆర్ గారు శ్రీదేవితో కూడా అనేక సినిమాలు చేశారు. చిన్న వ‌య‌సు నుంచే శ్రీదేవి బాలనటిగా సినిమాల్లో న‌టించడం కారణంగా బాల భార‌తం సినిమా నుంచి ఎన్టీఆర్ గారితో ఆమెకు మంచి అనుబంధం ఉంది.

NTR- Sridevi

ఈ క్ర‌మంలోనే వేట‌గాడు వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ గారు శ్రీదేవికి హీరోయిన్‌ గా అవకాశం కలిగించారు. అయితే, వీరి మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బ‌డిపంతులు అనే చిత్రంలో ఎన్టీఆర్ గారితో శ్రీదేవి కలిసి నటించింది. ఆ సమయంలో శ్రీదేవి నటన చూసి ఎన్టీఆర్ గారు చాలా ముచ్చట పడ్డారు.

Also Read: Thank You Collections: ‘థాంక్యూ’ 2 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

ఓ రోజు ఉదయం అందరూ షూట్ లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ గారు, శ్రీదేవిని దగ్గరకు పిలిచి పేరు ఊరు వివరాలు అడిగారు. శ్రీదేవి మాటలు ఆయనకు మరింత ఆసక్తిని కలిగించాయి. అందుకే, ఎన్టీఆర్ గారు.. శ్రీదేవి జాతకం తీసుకున్నారు. మహా పండితులకు ఎన్టీఆర్ ఆమె జాతకాన్ని చూపించారని అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది కూడా.

ఇదే విషయం గురించి ద‌ర్శ‌కుడు బి. విఠ‌లాచార్య‌.. ఎన్టీఆర్ ను అడిగారు. ‘అన్నగారు మీరు ఏమిటి ?, ఆ పాప జాతకం తీసుకోవడం ఏమిటి ? అని అడగగా.. మీ కోసమే బ్రదర్. ఆమె జాతకం తీసుకున్నాము. కానీ మేము ఎవరికీ ఆమె జాతకాన్ని చూపించలేదు. మీరే ఆమె జాతకం చూడగలరు’ అంటూ విఠలాచార్య వైపు చూశారు ఎన్టీఆర్.

NTR- Sridevi

విఠ‌లాచార్య గారికి జ్యోతిష్య‌శాస్త్రంపై బాగా ప‌ట్టు ఉంది. ఆ రోజుల్లో ఆయన ప‌లువురికి జాత‌కాలు చెప్పేవారు. కృష్ణ సూపర్ స్టార్ అవుతాడు అని విఠ‌లాచార్య గారు ముందే చెప్పారు. అలాగే, ఎన్టీఆర్ గారు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని విఠ‌లాచార్య ముందే చెప్పారు. కానీ, విఠ‌లాచార్య గారు చాలా త‌క్కువ మందికే జ్యోతిష్యం చెప్పేవారు.

ఎన్టీఆర్ గారిపై ఉన్న అభిమానంతో శ్రీదేవి జాతకాన్ని ఆయన పరిశీలించి.. “ఈ పాప మొత్తం దేశానికే పెద్ద హీరోయిన్ అయ్యేలా ఉంది అన్నగారు“ అని విఠ‌లాచార్య ఆశ్చర్యపోతూ చెప్పారట. ఐతే, ఎన్టీఆర్ గారి నోట నుంచి ఈ జాతకం బయటకు రావడంతో శ్రీదేవి డేట్లు కోసం నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ పోటీ కారణంగానే ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఆమె నిజంగానే మొట్టమొదటి పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. ‘నా విషయంలో ఎన్టీఆర్ గారు చూపించిన జ్యోతిష్యం నిజ‌మైంద‌ని శ్రీదేవి గారు కూడా ఓ ఇంటర్వ్యూలో ప్ర‌స్తావించారు.

Also Read:Allu Arjun- National Award: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాబోతుందా…?

Tags