Rama Rao On Duty Pre-Release Business: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. బలమైన నేపథ్యంతో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సహజంగానే రవితేజ సినిమాలకు ఏవరేజ్ గా బిజినెస్ జరుగుతుంది. కానీ, రామారావుకి మాత్రం భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వైజ్ గా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.
Also Read: NTR- Sridevi: శ్రీదేవి జీవితంలో ఎన్టీఆర్ చెప్పిందే జరిగింది.. ఇంతకీ ఏమిటో తెలుసా అది ?
నైజాం 11 కోట్లు
సీడెడ్ 07.2 కోట్లు
ఉత్తరాంధ్ర 4 కోట్లు
ఈస్ట్ 3.1 కోట్లు
వెస్ట్ 2.4 కోట్లు
గుంటూరు 3.5 కోట్లు
కృష్ణా 3 కోట్లు
నెల్లూరు 2.8 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఈ సినిమాకి 35 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్లు,
ఓవర్సీస్ 8 కోట్లు,
ఓవరాల్ గా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 47 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఖిలాడీ లాంటి ప్లాప్ సినిమా తర్వాత రవితేజ నటించిన సినిమా అయినప్పటికీ.. ఈ సినిమా పై ఆ ప్లాప్ ఇమేజ్ పడలేదు. ఇక, డబ్బింగ్ వెర్షన్స్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా కలుపుకుంటే.. మరో పది కోట్లు వరకు ఉంటుంది. అంటే.. మొత్తం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 57 కోట్లు జరిగింది.
కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ కావాలంటే.. కనీసం 57 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టాలి. అలాగే, 114 కోట్ల నుంచి 120 కోట్ల దాకా గ్రాస్ ను రాబట్టాల్సి ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జాతకం ఎలా ఉంటుందో ? ఈ చిత్రం ఏ రేంజ్ జాతర చేస్తుందో చూడాలి.
Also Read:Thank You Collections: ‘థాంక్యూ’ 2 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?