https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ లైనప్ భారీగా పెరుగుతుంది… హోంబలే ప్రొడక్షన్ లో మూడు సినిమాలను చేసే దర్శకులు వీళ్లనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 01:36 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడొస్తున్న సినిమాలతో మన హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…

    బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్… ఆయన చేస్తున్న ప్రతి సినిమా తనదైన రీతిలో సక్సెస్ ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆయన నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈయనలంటి హీరో ఇండస్ట్రీ లో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన వరుసగా సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయిన ప్రభాస్ ఇప్పుడు హోంబలే ప్రొడక్షన్ హౌజ్ లో వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలకు డైరెక్షన్ ఎవ్వరూ చేయబోతున్నారనే విషయాల పట్ల కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక అప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళ బ్యానర్ లో ప్రశాంత్ వర్మ తో ఒక సినిమా, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయబోతున్నాడట.

    ఇక మూడో సినిమా ఏ దర్శకుడితో చేయబోతున్నాడు అనేదాని పట్ల సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మలతో ప్రభాస్ సినిమా చేయాలంటే మరొక మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పట్టే అవకాశమైతే ఉంది… ఇక సినిమాల మీద సినిమాలకు కమిట్ అవుతూ ముందుకు దూసుకెళుతున్న ప్రభాస్ ప్రస్తుతం ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు తన డేట్స్ అయితే ఖాళీగా లేవనే చెప్పాలి.

    ఇక ఆయనతో సినిమా చేయాలనుకున్న దర్శకుడు ఎవరైన కూడా ఆయన కోసం ఆరు సంవత్సరాల సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది….

    ఇక వరుసగా సలార్ కల్కి లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక మార్చ్ లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా విషయంలో ప్రభాస్ పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…