
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదనేది సగటు మనిషి ఆవేదన. ఈ మహమ్మరి దెబ్బకు అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు సైతం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బే. ఇక సినిమా ఇండస్ట్రీల పరిష్టితి అయితే మరి దారుణంగా ఉంది. సీరియల్ షూటింగ్ చేయటానికి కూడా కరోనా వల్ల భయపడాల్సి వస్తోందంటే.. సినిమాల షూటింగ్స్ గురించి ఇక ఆలోచించుకునే అవకాశమే లేకుండా పోయింది. మొత్తానికి సినిమా వాళ్ళు భయాందోళనకు గురవుతోన్నారు. పైగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నా.. అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. అయితే మరణాలు సైతం భారీగా నమోదవుతుండటం కరోనా పట్ల ప్రజలందరిలో ఓ తెలియని నిర్లిప్తం నెలకొని ఉంది.
నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు
ఇక ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం అనేది జీవితంలో సర్వసాధారణం అయిపొయింది. సరే ఈ మాస్కులు ధరించినా ప్రజలను అవి కరోనా నుండి ఎంతమాత్రం కాపాడుతాయనేదే ఇక్కడ మరో పెద్ద ప్రశ్న. అయితే ఇప్పుడు ఆ అనుమానాలన్నిటికీ చెక్ పెట్టబోతోంది ఓ ఇజ్రాయిల్ కంపెనీ. తమ కంపెనీ తయారు చేసిన మాస్కులను వాడితే మాత్రం ఇక కరోనా వైరస్ రాదట. ఇప్పటికే తమ మాస్కును ప్రయోగశాలల్లో ప్రయోగించినట్లు కూడా ఆ కంపెనీ పేర్కొంది. నిజంగా ఇలాంటి మాస్క్ లు వస్తే ఇక హ్యాపీగా షూటింగ్స్ చేసుకోవచ్చు.
భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్
ఇంతకీ ఈ మాస్క్ ఎలా కాపాడుతుంది అంటే.. మాస్క్ క్లాత్ లోని నానో పార్టికల్స్ ఒకరకంగా శానిటైజర్‌గా పనిచేస్తాయని… మాస్క్ వద్దకు వచ్చే అన్ని సూక్ష్మ క్రిములను అవి నాశనం చేస్తాయని తెలుస్తోంది. మొత్తానికి మాస్కుల తయారీలో ఈ ఫార్ములా విజయవంతం అయితే వీటిని త్వరలోనే మార్కెట్లోకి వదులుతారు. ఏది ఏమైనా ఇలాంటి మాస్కులు మార్కెట్లోకి వస్తే మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవడం ఖాయం. ముఖ్యంగా సినిమా వాళ్లకు ఇలాంటి మాస్క్ లు చాల బాగా ఉపయోగపడతాయి.