గవర్నర్ కు లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలివే..!

ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ పలు అంశాల్లో విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి పంపిన లేఖ తానే రాశానని చెప్పుకొచ్చారు. ఈ లేఖ విషయంలో సీఐడీ తనను, తన సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గవర్నర్ కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటీషన్ ను హైకోర్టులో వేసిన రమేష్ […]

Written By: Neelambaram, Updated On : June 25, 2020 10:11 am
Follow us on


ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ పలు అంశాల్లో విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి పంపిన లేఖ తానే రాశానని చెప్పుకొచ్చారు. ఈ లేఖ విషయంలో సీఐడీ తనను, తన సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గవర్నర్ కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటీషన్ ను హైకోర్టులో వేసిన రమేష్ కుమార్ గవర్నర్ కు లేఖ రాయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్

గవర్నర్ కు రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో తనపై నిఘా పెట్టిందని, కొందరు వ్యక్తులు తనను నీడలా వెంటాడుతున్నారని తెలిపారు. అదేవిధంగా తన ఫోన్ ను ట్యాప్ చేసున్నారని ఫిర్యాదు చేశారు. తాను విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి వెళ్లకుండా భారీగా పోలీసులను మోహరించారని తెలిపారు. అదేవిధంగా విజయవాడలో తన తల్లికి అనారోగ్యంతో ఉన్నా వెళ్లి చూడలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ ప్రభుత్వ పెద్దల మద్దతుతో కనీసం తనకు సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు.

ఎంపీ విజయ సాయిరెడ్డి కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారని.. అయితే లేఖ తానే రాశానని చెప్పినా పోలీసులు వినకుండా తనను, కార్యాలయ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కార్యాలయంలో కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జస్టిస్ కనగరాజ్ ను హైకోర్టు తొలగించినా ఎన్నికల సంఘం ఇన్నోవా వాహనం ఆయన వద్దే ఉందని తెలిపారు.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

ఎన్నికల సంఘం కమిషనర్ నియామక అధికారం గవర్నర్ కే ఉందని హైకోర్టు సూచించిందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తనను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. తనను ఎన్నికల కమిషనర్ గా నియమించే విషయంలో గవర్నర్ ను జోక్యం చేసుకోవాలని కోరారు.

సుజనా, కామినేనిలతో భేటీ విషయం చర్చనీయాంశం కావడంతో, ఈ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే గవర్నర్ కు లేఖ రాయడం, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం వంటి చర్యలు చేపట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు తన భేటి గురించి ఎన్ని విమర్శలు వస్తున్నా ఆ అంశాన్ని లేఖలో పేర్కొనకపోవడాన్ని తప్పుబడుతున్నారు.