https://oktelugu.com/

NTR: దేవర పని అయి పోయింది. మరి ఎన్టీయార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎలాంటి కసరత్తులు చేస్తున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక వాళ్లకంటూ సపరేట్ ఐడెంటిటి కోసం అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్నారు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవడానికి ఇప్పటికి చాలా వరకు కష్టపడుతున్నాడనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 10:30 AM IST

    NTR Dragon

    Follow us on

    NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా మంచి విజయాన్ని సాధించింది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ నటుడు తనను తాను భారీ రేంజ్ లో ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాన్ ఇండియాలో ఇప్పటికే సోలో హీరోగా తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో భారీ కలెక్షన్లను రాబట్టాలని అనుకున్నాడు. కానీ ఆయన ఆశలన్ని అడియాశలు అయ్యాయి. ఇక ఈ సినిమా కేవలం 300 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. దాంతో ఎన్టీయార్ భారీగా డీలాపడ్డాడు. అయితే సినిమా సక్సెస్ అయినప్పటికి భారీగా వసూళ్లు రాకపోవడం పట్ల ఆయన తీవ్రమైన మనస్థాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే కలెక్షన్లను సంపాదిస్తేనే ఆయన మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వరుసగా ఏడు విజయాలను అందుకున్న ఈయన ఇండస్ట్రీని శాసించే కలెక్షన్స్ కి మాత్రం సంపాదించడంలో కొంత వరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి.

    ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఆయన హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒకవేళ భారీ కలెక్షన్లు సాధించినట్లైతే అది హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన కలెక్షన్స్ గానే గుర్తిస్తారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా సాధించిన కలెక్షన్స్ అని మాత్రం అనుకోరు.

    కాబట్టి ఆయన ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాతో ఎలాగైనా సరే 1500 కోట్ల వరకు కలక్షన్స్ ను రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఆ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప లేకపోతే మాత్రం మిగిలిన హీరోలు అందరి కంటే కూడా పాన్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు వెనకబడిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి అయితే లేదు…

    ఇక ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు తమ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక వాళ్లనుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవాలంటే జూనియర్ అంతకుమించి కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరమైతే ఉంది…