https://oktelugu.com/

World Television Day 2024: టీవీ దినోత్సవం అసలు ఎలా మొదలైంది? దాని చరిత్ర ఏంటంటే?

టెలివిజన్ రంగానికి గుర్తింపు ఇవ్వడానికి ప్రతీ ఏడాది నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవం జరుపుకుంటారు. టెలివిజన్ అనేది ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేసింది.

Written By: Kusuma Aggunna, Updated On : November 21, 2024 10:27 am
world television day

world television day

Follow us on

World Television Day 2024: ప్రస్తుతం అయితే మొబైల్స్ వినియోగం పెరిగి టీవీలకు కాస్త డిమాండ్ తగ్గిందని చెప్పవచ్చు. గతంలో ఇంటికి ఒక ఫోన్ ఉండేది. కానీ ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. టీవీల్లో వచ్చే ప్రతీ విషయాన్ని కూడా మొబైల్‌లో చూస్తున్నారు. ఇంకా వీటి వినియోగం తగ్గింది. అయితే టెలివిజన్ రంగం ఎన్నో విషయాలను ప్రజలకు అందించింది. దీనిపై ఇంకా అవగాహన కల్పించి ముందుకు వెళ్లడానికి, టెలివిజన్ రంగానికి గుర్తింపు ఇవ్వడానికి ప్రతీ ఏడాది నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవం జరుపుకుంటారు. టెలివిజన్ అనేది ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేసింది. పూర్వం రోజుల్లో పెద్దగా ఏ విషయం తెలిసేది. మరుసటి రోజు ఉదయం పేపర్ వచ్చే వరకు తెలియదు. కానీ టీవీ వల్ల ఎప్పటికప్పుడూ అన్ని విషయాలు తెలిసేవి. ఇప్పుడు మొబైల్స్ వినియోగం పెరిగి టీవీ చూడటమే తగ్గించేశారు. కానీ అప్పటిల్లో ఏ షో చూడాలని అనుకున్నా కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చుని చూసేవారు. ప్రస్తుతం రోజుల్లో అయితే ఎవరికి నచ్చినట్లు వారు మొబైల్ చూసుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న టీవీ వినియోగం చూసి ఐక్యరాజ్య సమితి మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరమ్‌ను 1996 నవంబర్ 21న నిర్వహించింది. చాలా మంది ప్రముఖులు ఈ ఫోరమ్‌లో పాల్గొన్నారు. అయితే అప్పుడు టెలివిజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఏడాది నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. కమ్యూనికేషన్ రంగంలో టెలివిజన్ ముఖ్యపాత్ర పోషించింది. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది. కానీ అప్పటి నుంచి టీవీ సోషల్ మీడియాగా ప్రజలకు చాలా దగ్గరగా ఉంది. ప్రపంచ రాజకీయాల్లో కూడా టీవీ ముఖ్యపాత్ర పోషించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ చూసి పాఠాలు నేర్చుకోవడం, ఏదైనా తెలుసుకోవడం వంటివి చేస్తున్నారు. కానీ అప్పుడు మాత్రం టీవీలోనే అన్ని విషయాలు నేర్చుకునేవారు. ఒక విద్య, ఇతర విషయాలు తెలియాలన్నా కూడా టీవీ నుంచే తెలిసేవి.

ప్రస్తుతం రోజుల్లో డిజిటల్ మీడియా రంగం రావడంతో టీవీకి కాస్త ప్రాధాన్యత తగ్గింది. అందరూ కూడా ఏ విషయాన్ని అయిన క్షణాల్లో తెలుసుకుంటున్నారు. గతంలో ఉన్నట్లు గంటల సమయం టీవీ ముందు వెచ్చించే టైమ్ కూడా వారికి ఉండటం లేదు. దీంతో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా ఈ విషయాలను తెలుసుకుంటున్నారు. మీడియా రంగంలో ఎంతో ముఖ్య పాత్ర వహించిన టీవీ కనుమరుగు కాకుండా ఉండటానికి ప్రతీ ఏడాది నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని వినియోగాన్ని పెంచి ప్రజలకు టీవీ వల్ల ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ టీవీని 1924లో స్కాటిష్ ఇంజనీర్ జాన్ లోగీ బైర్డ్ కనిపెట్టారు. ఆ తర్వాత యునెస్కో సాయంతో 1959 సెప్టెంబర్ 15 న్యూఢిల్లీలోకి ప్రవేశపెట్టారు.