spot_img
Homeఎంటర్టైన్మెంట్Manchu Vishnu: 'మా'లో సభ్యత్వానికి విష్ణు మార్పులేమిటి ?

Manchu Vishnu: ‘మా’లో సభ్యత్వానికి విష్ణు మార్పులేమిటి ?

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించాక, చేసిన ప్రమాణాలు పై ఏకాగ్రత పెట్టాడు. ‘మా’ సంస్థ మన కోసం మనం పెట్టుకున్నాం. మరి మన కోసం పని చేయడానికి మనలో ఒకడు కూడా పనికి రాడా?’ అంటూ విష్ణుకి సపోర్ట్ చేసిన రవిబాబు లాంటి వాళ్ళు విష్ణుకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా నటీనటులకు ‘మా’లో సభ్యత్వానికి వెసులుబాటు కల్పించడం.
Manchu Vishnu
నిజానికి తెలుగు సినిమా రంగంలో ఎందరో నటీనటులకు ఇప్పటికీ ‘మా’లో సభ్యత్వం లేదు. అయినా ఇన్నేళ్ల సుదీర్థ ప్రయాణంలో ‘మా’లో ఇంకా 900 సభ్యులు మాత్రమే ఎందుకున్నారు ? నిజానికి నటించిన వారందరూ ‘ మా’ లో చేరితే సంఖ్య వేలల్లో ఉంటుంది. కానీ ఎందుకు చేరరు ? చాలా మంది సభ్యత్వం పై శ్రద్ధ చూపించరు. ఇక శ్రద్ధ చూపించిన వారికి సభ్యత్వం ఇవ్వరు.

ఎందుకంటే వారికి అర్హత ఉండకపోవచ్చు. ‘మా’ లో సభ్యత్వానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. నటీనటులు ఎన్ని చిత్రాలలో నటించినా, కనీసం అయిదు చిత్రాలలో ఒక్కో డైలాగ్ అయినా ఉన్నట్టు చూపించాలి. అలాగే సభ్యత్వానికి లక్ష రూపాయలు చెల్లించాలి. అయితే విష్ణు లక్షను మా’ సభ్యత్వ రుసుము రూ.75,000 వేలకు తగ్గిస్తామని హామీ ఇచ్చాడు.

ఇక సభ్యత్వానికి రుసుము ఒకేసారి చెల్లిస్తే, ఏడాది తర్వాత గుర్తింపు ఇస్తారు. ఒకేసారి చెల్లించలేని వారు రెండేళ్లలో దఫాలుగా చెల్లించాలి. వారికి ఏడాది అనంతరం గుర్తింపు ఇస్తారు. అప్పటినుంచే ‘మా’ లో ఓటు హక్కు లభిస్తుంది. పైగా సభ్యుడిగా చేరాలి అంటే.. అది పెద్ద ప్రాసెస్ గా ఉంది ఇన్నాళ్లు. అయితే, విష్ణు సలహాదారులు ఆ ప్రాసెస్ ను మార్చమని సలహా ఇస్తున్నారు.

మంచు విష్ణు కూడా సభ్యత్వానికి కావాల్సిన అర్హతలను మార్చాలని నిర్ణయించుకున్నారు. విష్ణు మారిస్తే సభ్యత్వం కోసం వందల మంది దరఖాస్తు చేసుకునేలా ఉన్నారు. కారణం.. ‘మా’ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి పేద కళాకారులకు ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే ‘మా’లో సభ్యత్వానికి విష్ణు ఎలాంటి మార్పులు చేయబోతున్నాడు అనేది చూడాలి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper