Raja Saab collections: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన రాజాసాబ్ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా మీద సగటు ప్రేక్షకుకు పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికి మారుతి ఈ సినిమా కోసం చాలా సంవత్సరాల పాటు కష్టపడ్డాడు… చాలా రోజులపాటు తన రిలీస్ ని వాయిదా వేసుకుంటూ వచ్చినప్పటికి ఎట్టకేలకు ఈ మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ప్రభాస్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ గత సినిమాలు ఆయన సలార్, కల్కి లాంటి సినిమాలు 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నాయి.
ఇక ఈ సినిమా కూడా 1000 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందా? లేదా అనే అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ lo చూపించిన కంటెంట్ ను బట్టి చూస్తే అలాగే ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ ని బట్టి చూస్తే ఈ సినిమా 1000 కొట్టు కలెక్షన్స్ రాబట్టే విధంగా కనిపించడం లేదంటూ సగటు సినిమా విమర్శకులు సైతం ఈ సినిమా మీద కొన్ని కామెంట్స్ చేస్తున్నారు…
కారణం ఏంటి అంటే ప్రభాస్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకి హిట్ టాక్ రావడమే ఎక్కువ 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాలి అంటే సినిమాని రిపీటెడ్ గా చూసే ఆడియన్స్ ఉండాలి. కానీ ఈ సినిమాకి అభిమానులు తప్ప ప్రేక్షకులెవరు రిపీట్ గా చూసే అవకాశం ఉండకపోవచ్చు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… నిజానికి ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ప్రభాస్ హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న వాడవుతాడు.
రాజాసాబ్ ఇలా మూడు సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించిన స్టార్ హీరోగా పలు రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడు. కానీ ఈ సినిమా యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయే విధంగా కనిపిస్తోంది. హ్యూజ్ సక్సెస్ రావాలంటే మాత్రం ఈ సినిమాలో అంత పెద్ద కంటెంట్ కూడా లేనట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన సత్తా చాటుతాడా? లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది…