https://oktelugu.com/

Sirivennela: పద్మ శ్రీ సిరివెన్నెల ఒక పాటకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతంటే?

Sirivennela:  తెలుగు సినిమా పాటల ప్రపంచంలో ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. అత్యద్భుతమైన పాటలను అందించిన ఆ కలం ఆగిపోయింది. వెటరన్ లిరిసిస్ట్స్ ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి సుందర రామమూర్తి తర్వాత ఆయన బాటలో నడిచి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న ‘సిరివెన్నెల’ ఇక లేరు. సినిమా పేరును తన పేరుగా మార్చుకున్న ‘చేంబోలు’ సీతారామశాస్త్రి..చనిపోయే వరకూ పాటలు రాస్తూనే ఉన్నారు. 35 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 800 సినిమాల్లో 3,000 వేల పాటలు రాసి టాలీవుడ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 6, 2021 / 10:41 AM IST
    Follow us on

    Sirivennela:  తెలుగు సినిమా పాటల ప్రపంచంలో ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. అత్యద్భుతమైన పాటలను అందించిన ఆ కలం ఆగిపోయింది. వెటరన్ లిరిసిస్ట్స్ ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి సుందర రామమూర్తి తర్వాత ఆయన బాటలో నడిచి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న ‘సిరివెన్నెల’ ఇక లేరు. సినిమా పేరును తన పేరుగా మార్చుకున్న ‘చేంబోలు’ సీతారామశాస్త్రి..చనిపోయే వరకూ పాటలు రాస్తూనే ఉన్నారు. 35 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 800 సినిమాల్లో 3,000 వేల పాటలు రాసి టాలీవుడ్ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. యువతకు దిశానిర్దేశం చేసే పాటలు రాసిన మహాయోగి సిరివెన్నెల. ఆయన చిత్రసీమకు చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన జీవితం, పాటలపై స్పెషల్ ఫోకస్..

    Sirivennela

    సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోయేంత వరకు కూడా ఏ ఒక్కరోజూ ఖాళీ లేరు. శాస్త్రి గారి కోసం దర్శక నిర్మాతలు ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉండేవారు. టాలీవుడ్ యంగ్ ప్లస్ సీనియర్ డైరెక్టర్స్ సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకునేందుకుగాను పోటీ పడేవారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీకాంత్ అడ్డాల, కృష్ణవంశీ ఇతర దర్శకులకు సిరివెన్నెల ఆస్థాన రచయితగా కొనసాగారు. దాదాపుగా వారి ప్రతీ సినిమాలో రెండు లేదా మూడు పాటలు సీతారామశాస్త్రి రాసేవారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి వారం రోజుల్లోనే హఠాన్మరణం చెందారు సిరివెన్నెల.

    సీతారామశాస్త్రి చనిపోయే ముందర నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో రెండు పాటలు రాశారు. ఈ సినిమాలో ఓ పాట రాసిన తర్వాత అదే తన అఖరి పాటని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌కు చెప్పడం గమనార్హం. అలా ఆయన అన్నట్లుగానే అదే తన చివరి పాట అయింది. ఇకపోతే మూడు దశాబ్దాల సినీ ప్రయాణం సిరివెన్నెల రెమ్యునరేషన్ కోసం ఏనాడు పాటలు రాయలేదు. సినిమా కథను బట్టి అర్థవంతమైన సందర్భం కోసం పాటలు రాశారు. పారితోషికం ఇంత కావాలని ఏనాడు సిరివెన్నెల డిమాండ్ చేయలేదు.

    Also Read: Bangarraju Movie: బంగార్రాజు సినిమా నుంచి ” నా కోసం ” సాంగ్ రిలీజ్…

    తన రెమ్యునరేషన్ పెంచాలని సిరివెన్నెల ఏ ప్రొడ్యూసర్‌ను అడగలేదు. ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు సిరివెన్నెల రెమ్యునరేషన్ పెంచారట. ఆయన అందరినీ విడిచి వెళ్లిన సందర్భంలో సినీ ప్రముఖులు సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో సిరివెన్నెల ఒక్కో పాటకు రూ.3 నుంచి 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. నెలకు 30 నుంచి 50 పాటలు రాసే సిరివెన్నెల..ఇటీవల కాలంలో అనారోగ్యం వల్ల నెలకు 10 నుంచి 20 పాటలు మాత్రమే రాశారు. ‘శ్యామ్ సింగరాయ్, ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో సిరివెన్నెల రచించిన పాటలు త్వరలో విడుదల కానున్నాయి.

    Also Read: Tollywood Actors: తెలుగు హీరోలను జస్టిస్ ఎస్వీ రమణ అంత మాటన్నాడా..?

    Tags