Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం “బంగార్రాజు”. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ – నాగార్జున కాంబోలో గతంలో వచ్చిన “సోగ్గాడే చిన్నినాయన” సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ప్రక్షాకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. పైగా ఈ మూవీలో అక్కినేని హీరోలైన నాగ్ – చైతూ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Bangarraju Song
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. “బంగార్రాజు” సినిమాలోని సోల్ ఫుల్ మెలోడీ “నా కోసం” సాంగ్ రిలీజ్ చేశారు. ఈ మెలోడీ సాంగ్ లో చై, కృతి అందరినీ ఆకట్టుకున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఈ పాటకు అనూప్ రూబెన్స్ ట్యూన్ అందించగా సిద్ శ్రీరామ్ పాడటం విశేషం. గతంలో కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన… బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. పంచ కట్టు తో సరసాలు, చిలిపి వేషాలకు బాక్సాఫీస్ మోత మోగింది. బంగార్రాజు గా నాగార్జున చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మరి ఈ మూవీతో మళ్ళీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారో లేదో చూడాలి.
Feel the Magnificent Love of #ChinnaBangarraju & #NagaLakshmi from @sidsriram's Vocals🎤😍#NaaKosam Lyrical Song from #Bangarraju
▶️https://t.co/l3BTl1E1jb@iamnagarjuna @chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @anuprubens @ZeeStudios_ @ZeeMusicCompany pic.twitter.com/ggVitgbHNl— Annapurna Studios (@AnnapurnaStdios) December 5, 2021
Also Read: అసలు నీ బాధేంటి సమంత… గుమ్మడికాయల దొంగ ఎవరంటే..!
ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా… నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Mahesh Babu: ఫ్యాన్స్… మహేష్ నుండి అలాంటి సినిమాలు ఆశించకండి