Ramarao On Duty: ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’తో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ మంచి ఊపుమీదున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్నారు. క్రాక్ ఇచ్చిన ఊపుతో ఒకేసారి వరుస గా 5 ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు రవి తేజ. ఇప్పటికే రవితేజ 67 సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అలానే శరత్ మండవ దర్శకత్వంలో యసెల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ చిత్రంలో మాస్ మహారాజా సరసన మజిలీ బ్యూటీ దివ్యాన్ష్ కౌశిక్, మలయాళ కుట్టి రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Also Read: Balayya: అక్కడ కూడా రికార్డుల మోత మోగిస్తోన్న బాలయ్య !
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది మార్చి 25 న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్ తో రవితేజ ఫ్యాన్స్ లో కోలాహాలం నెలకొంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అలానే మరోవైపు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న ” ధమాకా” మూవీ షూటింగ్ లో కూడా రవితేజ పాల్గొంటున్నారు. త్వరలోనే ఖిలాడి ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తుంది. ఈ వార్తతో రవితేజ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. వీటితో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర్ చిత్రంలో నటిస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో కూడా చేస్తున్నాడు.
Also Read: Good Luck Sakhi: కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రానికి ఏమైంది… మరోసారి విడుదల తేదీ వాయిదా
https://twitter.com/RaviTeja_offl/status/1467714956338483206?s=20