https://oktelugu.com/

Horoscope Today : ఈరోజు ఈ రెండు రాశుల వారికి మహర్దశ.. ఏ పని చేపట్టినా విజయమే..

ఆర్థిక స్థితి పుంజుకుంటుంది. ప్రసంగంలో మాధుర్యం కనిపించాలి. కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం. వీటికి దూరంగా ఉండాలి. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండొచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 7, 2024 / 08:06 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఆయుష్మాన్ యోగం ఏర్పడనుంది. దీంతో తుల, మిథునం రాశుల వారికి అనుకోని అదృష్టం కలగనుంది. మరికొన్ని రాశుల వారికి ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. అయితే ఇంకొన్ని రాశుల వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    జీవిత భాగస్వామి కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

    వృషభ రాశి:
    కష్టపడి పనిచేసిన వారికి సరైన గుర్తింపు ఉంటుంది. కొందరు అనుకోని విజయాలు సాధిస్తారు. ఇంటికి అతిథులు వస్తారు. ఆకస్మిక ధనలా భం ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడుతారు.

    మిథున రాశి:
    ఈ రాశి వారు కొన్ని శుభయోగాలు పొందుతారు. జీవవనోపాధి కోసం వేసిన ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

    కర్కాటక రాశి:
    వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు అధికారులతో వాగ్వాదానికి దిగుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. స్నేహితులతో విహార యాత్రలకు వెళ్తారు.

    సింహారాశి:
    వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు మాటలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

    కన్య రాశి:
    సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి.

    తుల రాశి:
    వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. విద్యార్థులు ఏదైనా పరీక్షకు హాజరైతే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

    వృశ్చిక రాశి:
    ఆర్థికంగా లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఇంట్లో జరిగే వివాహం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు.

    ధనస్సు రాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కొన్ని రిస్క్ లు తీసుకోవాల్సి వస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.

    మకర రాశి:
    కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ హాని చేయకుండా జాగ్రత్త పడాలి. కొన్ని విషయాలపై ఏకాగ్రత ఉండదు. సాయం చేయడంలో ముందు ఉంటారు.

    కుంభరాశి:
    సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. గ్రహాల మార్పు కారణంగా వీరికి అదృష్టం వరించనుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి:
    ఆర్థిక స్థితి పుంజుకుంటుంది. ప్రసంగంలో మాధుర్యం కనిపించాలి. కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం. వీటికి దూరంగా ఉండాలి. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండొచ్చు.