https://oktelugu.com/

TATA Punch Facelift : SUV కారు కోరుకునేవారికి గుడ్ న్యూస్.. టాటా నుంచి కొత్త కారు..

కొత్త పంచ్ ఇన్నర్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. వైర్ లెస్ చార్జర్, రియర్ ఏసీ వెంట్స్, వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, ఆర్మ్ రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఎక్సీటీరియర్ లో కొత్తగా ఎటువంటి హంగులు తీర్చి దిద్దలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2024 / 04:18 PM IST

    TATA Punch Facelift 2024

    Follow us on

    TATA Punch Facelift : పండుగ సీజన్ ప్రారంభం కావడంతో దేశంలో వస్తువుల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆటోమోబైల్ రంగానికి చెందిన వాహనాలు పండుగ సీజన్ లో ఎక్కువ సేల్స్ నమోదు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న కార్లకు డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. మరికొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా లేటేస్టుగా టాటా కంపెనీ కొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా పంచ్ గురించి కారు వినియోగదారులకు దాదాపు తెలిసే ఉంటుంది. ఎస్ యూవీ వేరియంట్ లో ఈ మోడల్ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దీని ఫేస్ లిప్ట్ వెర్షన్ ను సెప్టెంబర్ 17న మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ కారును కొనుగోలు చేసేవారికి కొన్ని బెనిఫిట్స్ కూడా అందిస్తున్నారు. అవేంటంటే?

    దేశంలో టాటా కంపెనీ టాప్ 10 లిస్టులో ఉంటోంది. దీని నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఎన్నో మోడళ్లు ఆకట్టుకున్నాయి. అయితే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న వినియోగదారుల్లో చాలా మంది ఫేస్ లిప్ట్ ను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాటా కంపెనీ నుంచి పంచ్ ను ఫేస్ లిప్ట్ గా మార్చి రిలీజ్ చేశారు. కొత్త పంచ్ ఇంజిన్ 1.2 లీటర్ 3 సిలిండర్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఏఎంటీ వెర్షన్ తో కూడుకొని ఉంది.

    కొత్త పంచ్ ఇన్నర్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. వైర్ లెస్ చార్జర్, రియర్ ఏసీ వెంట్స్, వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, ఆర్మ్ రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఎక్సీటీరియర్ లో కొత్తగా ఎటువంటి హంగులు తీర్చి దిద్దలేదు. కానీ ఇందులో సన్ రూఫ్ అతి తక్కువ ధరతో అమర్చారు. ఇది ఈ కారుకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ మోడల్ మొత్తం ప్యూర్, ప్యూర్ అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్ సహా మొత్తం 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

    టాటా పంచ్ దేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న కార్లలో ఉంది. ఇప్పుడు మైక్రో ఎస్ యూవీగా నిలిచే టాటా పంచ్ ఫేస్ లిప్ట్ కూడా అదే బాటలో ఉండనుంది. దీనిని రూ. 6.12 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్రూ.9.45 లక్షలు ఉంది. అంతేకాకుండా కొత్తగా ఈ కారు కొనుగోలుచేసేవారికి రూ. 18 వేల బెనిఫిట్స్ ఇవ్వనున్నారు. దీంతో ఎస్ యూవీ కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఈ కారు ఇప్పటికే మార్కెట్లో ఉన్న సిట్రోయెన్ సీ 3, హ్యుందాయ్ ఎక్స్ టర్ వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక పండుగల సీజన్ ప్రారంభం కావడంతో కొత్త కారు కొనాలని చాలా మంది ఎదురుచూస్తూంటారు. ఈ తరుణంలో ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుందని అంటున్నారు.