Game Changer Movie : గేమ్ చేంజర్ సినిమా కి అపరిచితుడు సినిమాకి మధ్య సంబంధం ఏంటి..?

చిరంజీవి లాంటి నటుడు ఇండస్ట్రీలో ఎలాంటి మ్యాజిక్ ను చేశాడో మనందరికీ తెలిసిందే. ఇక తన తనయుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది... ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న వరుస సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకునేలా చేస్తున్నాయి...

Written By: Gopi, Updated On : October 31, 2024 7:27 pm

Game Changer Movie

Follow us on

Game Changer Movie :  మెగాస్టార్ చిరంజీవి తనయుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు…ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయినప్పటికి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు. మరి మొత్తానికైతే శంకర్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని నవంబర్ 9వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. రైల్వే ట్రాక్ పైన బనియన్ వేసుకొని లుంగీ కట్టుకున్న రామ్ చరణ్ రైల్వే ట్రాక్ పైన కూర్చుని కొంతమందిని ఆ ట్రాక్ కి కట్టేసినట్టుగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. వాళ్లని రామ్ చరణ్ శిక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది.

నిజానికి ఈ పోస్టర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లైతే శంకర్ ఇంతకుముందు విక్రమ్ తో చేసిన అపరిచితుడు సినిమాలో తప్పు చేసిన వారిని ఒక్కోరకంగా ఎలాగైతే శిక్షిస్తాడో ఇక్కడ రామ్ చరణ్ కూడా అలాగే వాళ్ళను శిక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అపరిచితుడు సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి ఏమైనా పోలికలు ఉన్నాయా అంటే ఈ శిక్షించడంలో పోలికలు ఉన్నాయని చెప్పవచ్చు… ఇక కావాలని శిక్షించడానికి కాకుండా వాళ్ళు ఏదో తప్పు పని చేస్తే వారిని చంపేయడానికి అలా చేసినట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే శంకర్ ఈ సినిమాలో తన గత చిత్రాల తాలూకు ఆనవాళ్లు ఉండకుండా మేనేజ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడక్కడ అపరిచితుడు ఫ్లేవర్ అయితే ఈ సినిమాకి కనిపిస్తుందని కొంతమంది సినీ క్రిటిక్స్ సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలా ఉంది అనేది తెలియాలంటే జనవరి 10వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…

ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే పాన్ ఇండియాలో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా తద్వారా రామ్ చరణ్ కి భారీ ఇమేజ్ వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…