Shahrukh Khan-Prabhas : షారుఖ్ ఖాన్ ని ‘ఛీ’ కొట్టిన ప్రభాస్..పగ పీకలదాకా పెంచేసుకున్నాడుగా..అసలు ఏమైందంటే!

అన్ని విధాలుగా చూస్తే షారుఖ్ ఖాన్ ఒక్కడే ప్రస్తుతం ప్రభాస్ కి ఒక మోస్తారుగా పోటీ ఇవ్వగలడు. కానీ షారుఖ్ ఖాన్ ని కూడా ప్రభాస్ ఒకసారి క్లాష్ లో చిత్తుచిత్తుగా ఓడిస్తాడు. సలార్, డుంకీ చిత్రాలు కేవలం ఒక్క రోజు తేడాతో విడుదలయ్యాయి. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్స్ వచ్చాయి కానీ, సలార్ చిత్రానికి వచ్చిన వసూళ్ళలో సగం కూడా 'డుంకీ' చిత్రానికి రాలేదు.

Written By: Vicky, Updated On : October 31, 2024 7:37 pm

Shahrukh Khan-Prabhas

Follow us on

Shahrukh Khan-Prabhas : ప్రస్తుతం ఇండియా లో ప్రభాస్ ని మించిన సూపర్ స్టార్ ఎవ్వరూ లేరు అనేది జగమెరిగిన సత్యం. ఆయన సినిమాలకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో, బాలీవుడ్ లో కూడా అలాంటి క్రేజ్ ఉంటుంది. అందువల్ల ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా ఇతర సూపర్ స్టార్స్ హిట్ సినిమాలతో సమానంగా వసూళ్లు వస్తున్నాయి. ఇక హిట్ అయితే లెక్క 600 కోట్ల రూపాయిల గ్రాస్ నుండి 1000 కోట్ల రూపాయిల వరకు వెళ్తుంది. సలార్ , కల్కి చిత్రాలు అందుకు ఉదాహరణ. కానీ బాలీవుడ్ హీరోలకు ప్రభాస్ కి ఉన్నంత మార్కెట్ లేదు. వాళ్లకి ఎంత వసూళ్లు వచ్చినా బాలీవుడ్ నుండి రావాల్సిందే, సౌత్ స్టేట్స్ లో మాత్రం అంతంత మాత్రం గానే ఉంటుంది. అయితే రీసెంట్ సమయంలో షారుఖ్ ఖాన్ ‘జవాన్’, రణబీర్ కపూర్ ‘ఎనిమల్’ చిత్రాలకు మన సౌత్ స్టేట్స్ లో కూడా భారీ వసూళ్లు వచ్చాయి. కారణం ఈ రెండు సినిమాలకు దర్శకులు మన సౌత్ ఇండియా కి చెందిన వాళ్ళు అవ్వడమే.

అన్ని విధాలుగా చూస్తే షారుఖ్ ఖాన్ ఒక్కడే ప్రస్తుతం ప్రభాస్ కి ఒక మోస్తారుగా పోటీ ఇవ్వగలడు. కానీ షారుఖ్ ఖాన్ ని కూడా ప్రభాస్ ఒకసారి క్లాష్ లో చిత్తుచిత్తుగా ఓడిస్తాడు. సలార్, డుంకీ చిత్రాలు కేవలం ఒక్క రోజు తేడాతో విడుదలయ్యాయి. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్స్ వచ్చాయి కానీ, సలార్ చిత్రానికి వచ్చిన వసూళ్ళలో సగం కూడా ‘డుంకీ’ చిత్రానికి రాలేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, ప్రభాస్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడట. ప్రభాస్ కి కలిసి స్టోరీ వినిపించగా, ఒక్క సిట్టింగ్ లోనే ఆయన ఆ కథని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం వేరే సినిమాల మీద ఉందని, మల్టీస్టార్రర్ చిత్రాలు చేయడానికి ఇప్పుడు సమయం లేదని ముఖం మీదనే చెప్పేశాడట. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు, ‘ధూమ్ 4’. ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా అని సోషల్ మీడియా లో ప్రభాస్ అభిమానులు నిరుత్సాహపడ్డారు.

కానీ ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ క్యారక్టర్ మెయిన్ లీడ్ గా ఉంటుందట. ఒకప్పుడు అయితే ప్రభాస్ కి ఇది చాలా పెద్ద ఛాన్స్, కానీ ఇప్పుడు ఆయన మార్కెట్ షారుఖ్ ఖాన్ కంటే పెద్దది, ఇప్పుడెందుకు ఆయనకంటే తక్కువ పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడు?, అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్ 2’, ‘రాజా సాబ్’ మూవీ షూటింగ్స్ లో బిజీ గా ఉన్నాడు. వీటి తర్వాత ఆయన స్పిరిట్, కల్కి 2 , ఫౌజీ వంటి చిత్రాలు చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఆయన నుండి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.