https://oktelugu.com/

Pushpa 2 Poster :పుష్ప 2 కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయడం వెనక ఇంత కథ ఉందా..? సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా…

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంది. హీరోలకు షాక్ ఇస్తూ మన హీరోలు అంతకంతకు ఎదుగుతున్న వైనం అక్కడి ప్రేక్షకులను ఆనందింపజేస్తుంటే బాలీవుడ్ హీరోలు మాత్రం వాళ్ల క్రేజ్ ని కోల్పోతున్నామనే ఒక బాధలో ఉన్నారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా మన హీరోలు ఈ సంవత్సరం భారీ సినిమాలతో సందడి చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 31, 2024 / 07:30 PM IST

    Pushpa 2 Poster

    Follow us on

    Pushpa 2 Poster  :అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమా రోజు రోజుకి భారీ అంచనాలను పెంచేస్తోంది. దీపావళి కానుక గా ఈ సినిమా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. మనకు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెంచడమే కాకుండా ఈ పోస్టర్ ద్వారా సినిమాలో ఒక డీటెయిల్ ని కూడా సుకుమార్ మనకు వదిలేసినట్టుగా తెలుస్తుంది…ఇక ఈ పోస్టర్ ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ రష్మిక మందనా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటో అది…అయితే ఈ సినిమాలో వైలెన్స్ తో పాటు ఒక ఫ్యామిలీ డ్రామా కూడా బాగా ఎలివేట్ చేయబోతున్నాం అనే విషయాన్ని సుకుమార్ ఈ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పాడనే చెప్పాలి. ఇక పుష్ప 2 అంటే ఇప్పటివరకు వైలెన్స్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా ఉండబోతున్నాయి అనే విధంగా పోట్రే అవుతూ వస్తుంది.

    ఇక అందుకే ఈ సినిమాలో హీరోకి ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ కూడా హీరో చేసే పనులకు ఎఫెక్ట్ అవ్వబోతున్నారనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెబుతున్నారు. మరి ఈ విధంగా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ పిక్ లో అల్లు అర్జున్ రష్మిక మందనాల కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ‘పుష్ప 2 ద రూల్’ ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే డిసెంబర్ 5వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

    ఇక తనదైన రీతిలో ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తానని పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే సుకుమార్ ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది…

    అందుకే ఈ సినిమా మీద అంచనాలను పెంచడానికి సుకుమార్ ప్రీ ప్లాన్డ్ గానే ప్రమోషన్స్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఇక అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించాలంటే సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయనేది ప్రేక్షకులకు తెలియజేయాలి. అందులో భాగంగానే ఫ్యామిలి ఆడియెన్స్ ను ఉద్దేశించి ఫ్యామిలీ అంతా చూసే ఒక మంచి ఫ్యామిలీ పోస్టర్ ని రిలీజ్ చేశాడు…