Homeఎంటర్టైన్మెంట్Mirai Glimpse: మిరాయ్ టీజర్ రివ్యూ: యోధుడిగా వస్తున్న తేజా సజ్జా... యాక్షన్, విజువల్స్...

Mirai Glimpse: మిరాయ్ టీజర్ రివ్యూ: యోధుడిగా వస్తున్న తేజా సజ్జా… యాక్షన్, విజువల్స్ కేక!

Mirai Glimpse: హనుమాన్ మేనియా ఇంకా తగ్గలేదు. 2024 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ హీరో మూవీగా హనుమాన్ తెరకెక్కించారు. హనుమాన్ ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరించింది. ఇక హనుమాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. హనుమాన్ మూవీ సీక్వెల్ జై హనుమాన్ లో హీరో తేజ సజ్జా కాదు. స్టార్ హీరో నటిస్తాడని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.

హనుమాన్ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న తేజ సజ్జా మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. నేడు టైటిల్ అండ్ కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. తేజ సజ్జా నెక్స్ట్ మూవీ టైటిల్ మిరాయ్. సూపర్ యోధ అనేది ట్యాగ్ లైన్. ఓ దైవ రహస్యం తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి ఉంచారు. ఆ గ్రంథాలను కాపాడేందుకు తొమ్మిది యోధులు నియమింపబడ్డారు. ఆ గ్రంథాలకు రక్షణ కరువైనప్పుడు.. రంగంలోకి దిగుతాడు ఒక యోధుడు. అతడే మిరాయ్.

మొత్తంగా మిరాయ్ కథ ఏమిటో కాన్సెప్ట్ టీజర్ లోనే చెప్పేశారు. అపార జ్ఞానం అందించే తొమ్మిది గ్రంథాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. అవి దుష్టుల చేతికి వెళ్లకుండా కాపాడే బాధ్యత మిరాయ్ తీసుకుంటాడు. కథకు అశోకుడు, ఆయన చేసిన కళింగ యుద్ధం నేపథ్యం జోడించారు. ఇక యోధుడిగా తేజా సజ్జా లుక్స్ ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేశాడు. విజువల్స్ సైతం మెప్పించాయి. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

తేజ సజ్జాతో చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ సైతం ప్రకటించారు. 2025 ఏప్రిల్ 18న విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్ మిరాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని సూర్య వర్సెస్ సూర్య మూవీతో దర్శకుడిగా మారాడు. రవితేజతో చేసిన ఈగల్ సైతం నిరాశపరిచింది. మూడో ప్రయత్నంగా మిరాయ్ తో వస్తున్నాడు.
Mirai Telugu Glimpse | Teja Sajja | Karthik Gattamneni | TG Vishwa Prasad | People Media Factory

Exit mobile version