Bommarillu: సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా రోజులపాటు గుర్తుండిపోతాయి…అలాంటి సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా ఒకటి…ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కాగా,ఈ సినిమాకి భాస్కర్ డైరెక్షన్ చేశాడు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.దాంతో భాస్కర్ పేరు కాస్తా బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది.అందుకే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడికి కూడా మంచి గుర్తింపు లభించింది.
ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్ , జెనీలియా వీళ్ళు ముగ్గురు పోషించిన క్యారెక్టర్లు ఈ సినిమాకి ముఖ్యమైన పిల్లర్స్ లాంటివి అనే చెప్పాలి.ఎందుకంటే ఈ మూడు క్యారెక్టర్ల ని బేస్ చేసుకొని భాస్కర్ ఈ కథ రాసుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అయితే ఈ కథ విన్నప్పుడు దిల్ రాజు కూడా చాలా బాగా ఎగ్జైట్ అయిపోయి మన బ్యానర్ లోనే ఈ సినిమా చేద్దామని చెప్పి ఆ సినిమా స్టార్ట్ చేసి తొందరగానే షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది.
ఇక బొమ్మరిల్లు భాస్కర్ కెరియర్ మొదట్లో ఆర్య సినిమా టైం లో సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినప్పుడు తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక స్టోరీ లైన్ ని సుకుమార్ కి చెప్పాడట అది సుకుమార్ కి బాగా నచ్చి ఈ కథ బావుంటుంది ఫుల్ కథ చేసుకొని పెట్టుకో అని చెప్పాడట….దాంతో బొమ్మరిల్లు భాస్కర్ కథ రాసుకునే పనిలో పడ్డాడు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ కథని పక్కన పెట్టేసాడు.అంతలోకే ఆర్య సినిమా రిలీజ్ అయింది సినిమా సక్సెస్ అయింది.సుకుమార్ మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.
ఆయన మరికొన్ని సినిమాలు చేస్తున్న టైంలో భాస్కర్ కనిపిస్తే సుకుమార్ ఆ తండ్రి కొడుకుల కథ పూర్తయిందా అని భాస్కర్ ని అడిగాడట దాంతో భాస్కర్ ఆ కథ ఇంకా పూర్తి కాలేదు అని చెప్పాడట. దాంతో సుకుమార్ ఉండి ఆ కథని తొందరగా చేసి డైరెక్షన్ చేయి అది మంచి కథ సూపర్ సక్సెస్ అవుతుంది అని చెప్పాడు… అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కథని పక్కన పెట్టకు తొందరగా రాసి పెట్టుకో అని చెప్తే భాస్కర్ దాన్ని సీరియస్ గా తీసుకొని ఆ కథ చేసే పనిలో పడి ఆ కథను పూర్తిగా ఫినిష్ చేసి దిల్ రాజు గారికి చెప్పడం జరిగింది.
అలా బొమ్మరిల్లు సినిమా రావడానికి ముఖ్య కారణం సుకుమార్ అనే చెప్పాలి… ఈ విషయాన్ని బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలాసార్లు తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది…