Seethamma Vakitlo Sirimalle Chettu: సీతమ్మ వాకిట్లో సినిమాలో వెంకటేష్ , మహేష్ బాబు పేర్లు ఏంటి..? పెద్దోడు చిన్నోడు పేర్ల వెనక అంత కథ ఉందా..?

ఈ సినిమా చూస్తున్నంత సేపు సినిమా కొంచం కూడా బోర్ లేకుండా చాలా అసక్తి కరంగా, ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అయినప్పటికీ ఈ సినిమా లో మహేష్ బాబు చెప్పిన డైలాగులు చాలా బాగా ఫేమస్ అయ్యాయి.

Written By: Gopi, Updated On : October 3, 2023 9:07 am

Seethamma Vakitlo Sirimalle Chettu

Follow us on

Seethamma Vakitlo Sirimalle Chettu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి…ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య బాబు, నాగార్జున,వెంకటేష్ లు వచ్చిన తర్వాత మల్టీస్టారర్ సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఇక దాంతో తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు రావు అనుకున్న సమయంలో వెంకటేష్, మహేష్ బాబు హీరోలు గా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా వచ్చింది ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల..

ఈ సినిమా చూస్తున్నంత సేపు సినిమా కొంచం కూడా బోర్ లేకుండా చాలా అసక్తి కరంగా, ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అయినప్పటికీ ఈ సినిమా లో మహేష్ బాబు చెప్పిన డైలాగులు చాలా బాగా ఫేమస్ అయ్యాయి.అయితే మొత్తానికి ఈ సినిమాలో వెంకటేష్ ని పెద్దోడు అని, మహేష్ బాబుని చిన్నోడు అని పిలిస్తు ఉంటారు.ఇక చాలా మంది వాళ్ల పేర్లు ఏంటి ఎందుకు వాళ్ళని అలా పిలుస్తున్నారు అంటూ చాలా మందికి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి…

అయితే ఈ సినిమా చూసిన వాళ్ళకి వాళ్లిద్దరి పేర్లు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే సినిమాలో ఎక్కడ కూడా వాళ్ళ పేర్లని వాడుతూ వాళ్ళని పిలవడం జరగదు. ఎవరైనా పెద్దోడు, చిన్నోడు అనే పిలుస్తారు.అయితే ఈ సినిమాలో వాళ్ళకి ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారు.అసలు వీళ్ల ఒరిజినల్ పేర్లు ఏంటి అనేవి మనం ఒకసారి తెలుసుకుందాం…

నిజానికి ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు వెంకటేష్ పేరు మల్లికార్జున్ రావు, మహేష్ బాబు పేరు సీతారామరాజు అని క్యారెక్టర్లకు పేర్లు ఫిక్స్ చేశాడట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల… కానీ ఆయన అందరికీ నరేషన్ ఇస్తున్నప్పుడు పేర్లు చెప్పకుండా పెద్దోడు, చిన్నోడు అనే పేర్లు మాత్రమే ఎక్కువ వాడేవాడు అంట…దానితో ఒకరోజు ఆయన వాళ్ల టీం కి మరోసారి నరేషన్ ఇస్తున్నప్పుడు పెద్దోడు, చిన్నోడు అనే పేరును వాడుతూ కథ చెప్పాడంట… హీరోల పేర్ల కంటే కూడా పెద్దోడు, చిన్నోడు అనే పేర్లు పిలవడానికి చాలా బాగున్నాయి అనుకొని ఆ క్యారెక్టర్లకి ఆ రెండు పేర్లను ఫిక్స్ చేశాడు.

కానీ శ్రీకాంత్ అడ్డాల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ల పేర్లను చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి పెద్దోడు, చిన్నోడు అనే పేర్లే వాళ్లకు బాగా సెట్ అయ్యాయి.ఎందుకంటే పేర్లు పెట్టి పిలిస్తే క్యారెక్టర్ కి మనం అంతగా కనెక్ట్ అవ్వం…పెద్దోడు, చిన్నోడు అని పిలిస్తేనే ఇంట్లో మన పేరెంట్స్ ఎలాగైతే మనల్ని పిలుస్తారో అలాంటి పేర్లతోనే సినిమాలో క్యారెక్టర్లు కూడా కనిపిస్తాయి. కాబట్టి నార్మల్ ఆడియన్ కూడా ఆ సినిమాకి ఈజీగా కనెక్ట్ అయిపోతాడు అని ఆ క్యారెక్టర్లకి పేర్లు మెన్షన్ చేయకుండా ఓన్లీ పెద్దోడు, చిన్నోడు అనే పేర్లు మాత్రమే మెన్షన్ చేశారు…అలా హీరోల పేర్లు లేకుండా వచ్చి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది…