Victory Venkatesh : వెంకటేష్ చేసిన ఈ సినిమాలు ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటి..?

కొంతమంది హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. అయితే ఆ సినిమాలు సక్సెస్ మాత్రం సాధించలేకపోతాయి. కారణం ఏదైనా కూడా ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే మాత్రం మెజారిటీ ప్రేక్షకులకు నచ్చాల్సి ఉంటుంది...

Written By: Gopi, Updated On : October 5, 2024 7:49 pm

Victory Venkatesh Flop Movie

Follow us on

Victory Venkatesh : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మాత్రమే మినిమం గ్యారెంటీ సినిమాలను చేస్తుంటారు. అందులో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా మినిమం గ్యారంటీ సినిమాలే కావడం విశేషం.. అంటే ఒకవేళ ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ప్రొడ్యూసర్లు పెద్దగా నష్టపోరు. అలాంటి సినిమాలకు ఆయన మొదటి నుంచి పెద్దపీట వేస్తూ వస్తున్నాడు. అయితే వెంకటేష్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించినప్పటికి కొన్ని సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. అయితే ఆ సినిమాలో కంటెంట్ బాగున్నప్పటికీ సినిమాని ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే విధానంలోనే ఎక్కడో ఒకచోట తేడా జరగడం వల్ల ఆ సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. ముఖ్యంగా ఆయన హీరోగా వచ్చిన సినిమాల్లో దేవి పుత్రుడు సినిమా గ్రాఫికల్ గా ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరైంది.

అయినప్పటికీ ఆ సినిమా కథపరంగా కూడా చాలా ఎక్స్ట్రాడినరీ కథ అనే చెప్పాలి. మరి అలాంటి కథను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడంలో మాత్రం ఎక్కడో ఒక చిన్న తేడా అయితే జరిగింది. దాని వల్లే సినిమా ఆధ్యాంతం ప్రేక్షకుడిని రక్తి కట్టించలేకపోయింది. ఇక ఫైనల్ గా ప్లాప్ టాక్ ను మూట గట్టుకుంది. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే భారీ ఫ్లాప్ గా మిగిలింది…

ఇక చింతకాయల రవి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ కామెడీతో ఎంటర్ టైన్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో కోర్ ఎమోషన్ అనేది కొంతవరకు తగ్గిందని దానివల్లే సినిమా ప్రేక్షకుడికి చెరువ్వలేదని కొంతమంది చెబుతుంటారు. కానీ ఈ సినిమాలో ఎమోషన్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది. కామెడీని బేస్ చేసుకుని వచ్చిన సినిమా కావడం వల్ల ఎమోషన్ అంత పెద్దగా ప్రభావాన్ని చూపించకుండా దర్శకుడు ఈ సినిమాని కొంతవరకు లిమిటెడ్ ఎమోషన్ తోనే ముందుకు తీసుకెళ్లాడు. ఇక అదే ఈ సినిమాకి మైనస్ గా మారిందని కొంతమంది సినీ విమర్శకులు కూడా చెబుతూ ఉంటారు. మొత్తానికైతే వెంకటేష్ కెరియర్ లో ఈ సినిమా కూడా ఒక ప్లాప్ గా మిగిలింది…

ఇక ఈ రెండు సినిమాల విషయంలో వెంకటేష్ కొంతవరకు అసంతృప్తినైతే వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇక ఎప్పుడైనా సరే తను ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం కొంతవరకు రిగ్రేట్ ఫీల్ అవుతూ ఉంటాడు. మంచి సినిమాలను చేసిన కూడా ప్రేక్షకులు తనని ఆదరించలేదని చెబుతూ ఉంటాడు…