Rishabh Shetty : తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నా రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ వేరె లేవల్ అనే చెప్పాలి. మొదటి సినిమాతోనే ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్టును సాధించి ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సినిమాల సెలక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా సినిమాకి సంబంధం లేకుండా జానర్స్ ని మారుస్తూ సినిమాలను సెలెక్ట్ చేసుకుని మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఎప్పుడైతే ‘రంగస్థలం’ సినిమా వచ్చిందో అప్పటినుంచి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ లో కానీ, ఆయన యాక్టింగ్ లో కానీ చాలా వరకు వేరియేషన్స్ అయితే చూపిస్తున్నాడు. మరి మొత్తానికైతే ఆయనతో సినిమా చేయడానికి ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పాన్ ఇండియా లో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి రామ్ చరణ్ కోసం ఒక మంచి కథను రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ‘కాంతార’ సినిమాతో తనను తాను డైరెక్టర్ గా, హీరోగా పోట్రే చేసుకున్న ఆయన ఇప్పుడు. ‘కాంతార 2 ‘ సినిమాతో మరొకసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.
కాంతార 2 సినిమా ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉండబోతుందని ఆయన ఇప్పటికే చాలా క్లారిటీ అయితే ఇచ్చాడు. మరి ఇలాంటి హీరో రామ్ చరణ్ కోసం ఒక సూపర్ మ్యాన్ తరహా కథను రెడీ చేసినట్టుగా కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. రిషబ్ శెట్టి హీరోగా కొనసాగుతూనే దర్శకత్వం మీద కూడా ఆయనకు చాలా వరకు పట్టుంది. దానివల్లే అటు దర్శకత్వం చేస్తూ ఇటు హీరోగా చేస్తూ రెండింటిని సమానమైన బాలన్స్ తో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
రామ్ చరణ్ తో మాత్రం ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేస్తానని పలు సందర్భాల్లో చెబుతున్నాడు. ఇక తను రాసుకున్న కథకు రామ్ చరణ్ అయితేనే పర్ఫెక్ట్ సెట్ అవుతాడని అందుకోసమే రామ్ చరణ్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి రిషబ్ శెట్టి డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా ఎప్పుడు రాబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…