https://oktelugu.com/

Rajendra Prasad : చిరంజీవి ని పట్టుకొని బోరుమని ఏడ్చేసిన రాజేంద్రప్రసాద్.. హృదయాన్ని కలిచివేస్తున్న వీడియో!

చిరంజీవి వచ్చి రాజేంద్ర ప్రసాద్ ని ఓదారుస్తున్న సమయం లో చిరంజీవి కంటతడి పెట్టుకోవడం చూసిన రాజేంద్ర ప్రసాద్ తన బాధ ని ఆపుకోలేక పోయాడు. చిరంజీవి ని గట్టిగా హత్తుకొని బోరుమని విలపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 8:01 pm
    Rajendra Prasad

    Rajendra Prasad

    Follow us on

    Rajendra Prasad : ప్రముఖ సీనియర్ హీరో, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి నిన్న అర్థ రాత్రి 12 గంటల 40 నిమిషాలకు తీవ్రమైన గుండెపోటుతో మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈరోజు తెల్లవారు జామున ప్రతీ ఒక్కరు ఈ చేదు వార్తతోనే తమ రోజుని ప్రారంభించాల్సి వచ్చింది. మనల్ని దశాబ్దాలుగా నవ్విస్తూ, ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన రాజేంద్ర ప్రసాద్ ని అలా కూతురు పార్థివ దేహాన్ని చూస్తూ బోరుమని విలపించిన వీడియోలు చూసి అభిమానులు, ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో జరిగిన ఈ విషాదం ని తెలుసుకొని సినీ పరిశ్రమ మొత్తం ఆయన్ని ఓదార్చేందుకు కదిలి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా ఎంతో మంది నటీనటులు రాజేంద్ర ప్రసాద్ ని కలిసి తమ సంతాపం వ్యక్తం చేసారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి వారు ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తపరిచారు.

    ఇది ఇలా ఉండగా చిరంజీవి వచ్చి రాజేంద్ర ప్రసాద్ ని ఓదారుస్తున్న సమయం లో చిరంజీవి కంటతడి పెట్టుకోవడం చూసిన రాజేంద్ర ప్రసాద్ తన బాధ ని ఆపుకోలేక పోయాడు. చిరంజీవి ని గట్టిగా హత్తుకొని బోరుమని విలపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ మొదటి నుండి ఇండస్ట్రీ లో ఎంతో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గత ఏడాది విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘హిట్లర్’, ‘డాడీ’, ‘మంచు పల్లకి’, ‘దొంగ’, ‘ఛాలెంజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సందర్భాలలో ఇండస్ట్రీ లో నాకు ఉన్న ఏకైక మిత్రుడు చిరంజీవి అని చెప్పుకొచ్చేవాడు. చిరంజీవి కూడా రాజేంద్ర ప్రసాద్ ని తన సొంత సోదరుడిలాగా భావించేవాడు.

    అలా ఎంతో అన్యోయంగా ఉండే ఈ ఇద్దరినీ ఇలాంటి పరిస్థితిలో చూడడం బాధాకరం. రాజేంద్ర ప్రసాద్ తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంది అనే కోపం తో చాలా కాలం వరకు ఆమెతో మాట్లాడలేదు. అయితే కూతురికి దూరం గా ఉండలేక మళ్ళీ ఇంటికి పిలిపించుకొని ఆమెతో ఆప్యాయంగా ఉండడం మొదలు పెట్టాడు. పెళ్ళైనప్పటికీ కూడా వీళ్లంతా కలిసి ఒకే కుటుంబం లాగా ఒకే ఇంట్లో ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ తన మనవరాలు సాయి తేజస్విని ని ‘మహానటి’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె చిన్ననాటి సావిత్రి పాత్రను పోషించింది. ఈ పాప ముఖం చూస్తే అచ్చు గుద్దినట్టు వాళ్ళ అమ్మ లాగానే అనిపించింది. ఇప్పుడు ఆమె ఇంత చిన్న వయస్సులో తల్లిని పోగొట్టుకుంది. రాజేంద్ర ప్రసాద్ కి ఈ బాధని భరించడం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.