why Trivikram put the same scene in these two movies
Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన మాటలతో గారడి చేస్తూ ఆయన సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడి మూతి మీద చిరునవ్వును కోరుకునే ఒకే ఒక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన రైటర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన మొదట్లో కథ మాటల రచయిత గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా తొందర్లోనే దర్శకుడిగా మారి దర్శకత్వ ప్రతిభలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఇక ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా అంత పెద్దగా సక్సెస్ కానప్పటికీ, త్రివిక్రమ్ అంటే జనాల్లో సినిమాల మీద ఇష్టం అయితే ఉంది. కాబట్టి తొందర్లోనే మళ్లీ ఒక మంచి సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తో ఆయన చేసిన జులాయి సినిమాలో బ్రహ్మాజీ ట్రావెల్ ఏజెన్సీని నడిపిస్తూ ఉంటాడు. అయితే ఆ ట్రావెల్ ఏజెన్సీ పేరు ‘పాక్ యువర్ బ్యాగ్స్’ అని ఉంటుంది. అయితే ఇది మనకు సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత మళ్లీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే ట్రావెల్ ఏజెన్సీని నడిపిస్తుంది.
ఆ ట్రావెల్ ఏజెన్సీ పేరు కూడా ‘ప్యాక్ యువర్ బ్యాగ్స్’ కావడం విశేషం… త్రివిక్రమ్ రెండు సినిమాల్లో ఇదే పేరును ఎందుకు వాడారు అని ఈ న్యూస్ తెలిసిన చాలామంది సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. గురూజీ తన సినిమాలోని సీన్ ను తనే కాపీ కొట్టాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్యాక్ యువర్ బ్యాగ్స్ అనే పేరుకి త్రివిక్రమ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి.?
ఆయనకా పేరంటే ఎందుకంత ఇష్టం. ఇక రెండు సినిమాల్లో అదే పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అనే పలు రకాల ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. ఇక మరికొందరైతే గురూజీ యూనివర్స్ కింద ఆయన సినిమా చేస్తున్నారు అందుకే రెండు సినిమాల్లో ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని టైటిల్ పెట్టారు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు…