Homeఆంధ్రప్రదేశ్‌Chiranjeevi: జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్ల సాయం.. ఏమోషనల్ అయ్యి కాళ్లు మొక్కిన పవన్.....

Chiranjeevi: జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్ల సాయం.. ఏమోషనల్ అయ్యి కాళ్లు మొక్కిన పవన్.. వైరల్ పిక్స్

Chiranjeevi: ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత.. చిరంజీవి రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పైగా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సినిమా పెద్దగా వివిధ ఫంక్షన్లకు హాజరవుతున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నారు. టికెట్ల రేట్ల పెంపుదల కోసం ఉభయకుశలోపరిగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టికెట్ల రేట్ల పెంపుదలపై పలుమార్లు కలిశారు.. అంతేతప్ప రాజకీయంగా చిరంజీవి తన అడుగులను ఏ పార్టీ వైపూ వేయలేదు.

పరామర్శించారు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మధ్య తుంటి ఎముక విరిగి ఆసుపత్రిపాలైతే చిరంజీవి పరామర్శించారు. చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ చేసుకుంటే పరామర్శించారు.. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు తన వద్దకు వస్తే వారితో మర్యాదగా మాట్లాడటం.. లేదా వారింట్లో ఏవైనా కార్యక్రమాలు జరిగితే హాజరవడం మినహా.. చిరంజీవి రాజకీయంగా ఏమీ చేయడం లేదు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని సన్మానించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలను ఆయన ముందు ఏకరువు పెట్టారు. రాయితీలు ఇచ్చి పరిశ్రమను ఆదుకోవాలని కోరారు.. అంతేతప్ప చిరంజీవి రాజకీయంగా ఎటువంటి అడుగులు వేయలేదు.

Chiranjeevi
Chiranjeevi

జనసేన పార్టీకి విరాళం

చిరంజీవి తెలంగాణలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పటికీ.. ఆయన మాతృభూమి ఆంధ్ర ప్రదేశ్. పైగా ఆయన తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి చిరంజీవి విరాళం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కు ఆ చెక్కు అందించి.. దానికి సంబంధించిన వివరాలను తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు చెక్కు అందించే కార్యక్రమంలో చిరంజీవి పక్కన నాగబాబు, ఇతర జనసేన నాయకులు ఉన్నారు. తమ దైవం ఆంజనేయ స్వామి ఎదురుగా చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ఈ చెక్కు అందించడం విశేషం. “అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు. కానీ నా తమ్ముడు అధికారంలో లేకపోయినా తన కష్టార్జితాన్ని రైతు కూలీల కోసం ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకు విరాళాన్ని అందించానని” చిరంజీవి రాస్కొచ్చారు.. దీంతో ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో చిరంజీవి ఎవరి వైపు ఉంటారో తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చిరంజీవి ట్విట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే చిరంజీవి దాదాపు 5 కోట్ల చెక్కును పవన్ కళ్యాణ్ కు అందించారు. విరాళం అందుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ చిరంజీవి కాళ్ళు మొక్కారు.

Chiranjeevi
Chiranjeevi

 

Chiranjeevi
Chiranjeevi

 

Chiranjeevi
Chiranjeevi
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version