Trivikram: ఈ రైటర్ల దగ్గర నుంచి సూపర్ హిట్ కథలను తీసుకున్న త్రివిక్రమ్…కారణం ఏంటంటే..?

రైటర్ గా ఉన్నప్పుడు కూడా కొంతమంది రైటర్ల దగ్గర నుంచి కొన్ని కథలను తీసుకున్నట్టుగా కొన్ని కథనాలైతే వెలువడ్డాయి. అందులో ముఖ్యంగా మనసంతా నువ్వే సినిమా డైరెక్టర్ అయిన విఎన్ ఆదిత్య త్రివిక్రమ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే.

Written By: Gopi, Updated On : March 8, 2024 9:57 am

Trivikram

Follow us on

Trivikram: రచయిత అంటే సమాజంలో ఆయన చూసిన విషయాలు గానీ, లేదా ఆయన చదివిన బుక్స్ లో ఆయనని ప్రభావితం చేసిన అంశాలను గాని తీసుకొని ఒక కథని రాసి దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా దర్శకుడు తెరకెక్కించినప్పుడే ఒక సినిమా సక్సెస్ అవుతుంది. అలా ఒక సినిమాని రాయాలంటే ముందు రచయిత దగ్గర ఘట్స్ ఉండాలి. అప్పుడే ఒక మంచి కథని రాయగలుగుతాడు. ఇక ఇలాంటి కోవకు చెందిన రైటరే త్రివిక్రమ్ శ్రీనివాస్…ఈయన స్వతహాగా రైటర్ అయినప్పటికీ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు.

తను రైటర్ గా ఉన్నప్పుడు కూడా కొంతమంది రైటర్ల దగ్గర నుంచి కొన్ని కథలను తీసుకున్నట్టుగా కొన్ని కథనాలైతే వెలువడ్డాయి. అందులో ముఖ్యంగా మనసంతా నువ్వే సినిమా డైరెక్టర్ అయిన విఎన్ ఆదిత్య త్రివిక్రమ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకరోజు వి ఎన్ ఆదిత్య రాసుకున్న ఒక స్టోరీని త్రివిక్రమ్ కి చెప్పాడట. దాంతో ఆ స్టోరీకి ఇన్ స్పైర్ అయిన త్రివిక్రమ్ ఆ కథ నాకు కావాలని చెప్పి ఆయన దగ్గర నుంచి ఆ కథను తీసుకున్నాడట. దానిని త్రివిక్రమ్ ఆ తరంగ నువ్వే నువ్వే సినిమాగా తీశాడట. ఇక త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా చేసే టైమ్ కి అందులో చాలా మార్పులు చేర్పులు చేసి త్రివిక్రమ్ ఆ సినిమాని తీశారని వి ఎన్ ఆదిత్య ఒక సందర్భంలో తెలియజేశాడు…

ఇక ఇదిలా ఉంటే యద్దనపూడి సులోచన రాణి రాసిన మీనా నవలను త్రివిక్రమ్ ఆమె అనుమతితోనే తీసుకొని అ ఆ సినిమాగా తెరకెక్కించి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అలాగే మధుబాబు లాంటి నవల రచయిత రాసిన చాలా బుక్స్ లో నుంచి కూడా చాలా సీన్లని త్రివిక్రమ్ ఆయన అనుమతితో తీసుకోవడం విశేషం…ఇలా ఒక స్టార్ రైటర్ అయి ఉండి కూడా మిగతా రైటర్ల దగ్గర నుంచి తనకు నచ్చిన సీన్లని తీసుకోవడం అనేది ఒక త్రివిక్రమ్ కి చెల్లింది అని చాలామంది సినీ విమర్శకులు సైతం ఆయన మీద చాలా ఘాటుగా స్పందిస్తున్నారు…