https://oktelugu.com/

Balakrishna: బాలకృష్ణ చేసిన ఈ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు మంచి సినిమాలను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే వాళ్లకు తెలిసిన సన్నిహితులు సైతం డైరెక్టర్లుగా మారినా కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా మంచి కథ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇక్కడ సక్సెస్ అనేది చాలా కీలకం. అందుకోసమే ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించాలని చూస్తుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2024 / 03:37 PM IST

    Nandamuri Balakrishna

    Follow us on

    Balakrishna: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ మొదట్లోనే వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడో అప్పటినుంచి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో బిజీ అయిపోయాడు. కెరియర్ మొదట్లో ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో మాస్ హీరోగా ఒక మంచి ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా కూడా ఎదిగాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా బాలయ్య బాబు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఎన్ బీ కే 109’ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. ఇక దాంతో పాటుగా బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో చేస్తున్న అఖండ 2 సినిమాని తొందర్లోనే రెగ్యూలర్ షూట్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు తన కెరియర్ లో రెండు భారీ డిజాస్టర్ సినిమాలను చేశాడు. ముఖ్యంగా ఆ సినిమాల వల్ల అతనికి ఒరిగిందైతే ఏమీ లేదు…ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అంటే ఒకటి ‘మహారధి’ కాగా, మరొకటి ‘విజయేంద్ర వర్మ’ ఈ రెండు సినిమాలతో బాలయ్య బాబు ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయితే అయింది.

    ఏ ఒక్కరు కూడా ఈ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించలేదు. ఇక దానికి తోడుగా బాలయ్య బాబు ఓవరాక్షన్ కూడా ఇందులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దర్శకుడు చెప్పిన మెరకే అతను నటిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమాలో కూడా నటించాడు.

    ఇక కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మరి దారుణంగా ఉంటాయి. అసలు ఏమాత్రం లాజిక్ లేకుండా సాగే ఈ సినిమాలను బాలయ్య బాబు ఎలా ఓకే చేశాడు. ఎలా ఈ సినిమాలను తెరమీదకి తీసుకొచ్చారు అంటూ కొంతమంది సినీ విమర్శకులు వీళ్ళని విమర్శిస్తూ ఉండడం విశేషం…

    ఇక బాలయ్య బాబు డైరెక్టర్స్ హీరో కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా చేస్తూ ఉంటాడు. అందువల్లే ఆయనకు ఇలాంటి కొన్ని భారీ డిజాస్టర్లు కూడా వస్తూ ఉంటాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. చూడాలి మరి ఇకమీదటైనా మంచి సినిమాలు చేసి ఆయన ఇండస్ట్రీలో యంగ్ హీరోలతో పోటీ పడుతూ ముందుకు సాగుతారా లేదా అనేది…
    One attachment • Scanned by Gmail